Kamakshi Bhaskarla: డాక్టర్ చదివింది, బెస్ట్ యాక్టరస్ గా అవార్డు అందుకుంది

Kamakshi Bhaskarla: రీసెంట్ టైమ్స్ లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే కరోనా టైంలో చాలా సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో పెద్ద హీరోలు సినిమాలు కూడా ఉండటం ఆశ్చర్యం. ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా ఆడియన్స్ అందరూ చూడగలుగుతున్నారు. చిన్న సినిమాలు అయినా కూడా ఆ సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని చెప్పొచ్చు.

హాట్స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల్లో అందరినీ ఆకట్టుకున్న సినిమా పొలిమేర. క్షుద్ర పూజలు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. చాలామందికి ఈ సినిమా ఎంత బాగుందో తెలియజేశారు. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా పొలిమేర 2 అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

పొలిమేర సినిమాలో సత్యం రాజేష్ లీడ్ రోల్ లో నటించాడు. సత్యం రాజేష్ కి భార్య పాత్రలో కామాక్షి భాస్కర్ల నటించింది. డాక్టర్ చదువుకున్న ఈవిడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పొలిమేర సినిమాతో మంచి గుర్తింపును సాధించుకుంది. ఇకపోతే పొలిమేర 2 సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వటం వలన ఈ సినిమాతో కూడా మంచి గుర్తింపును సాధించింది. ఇకపోతే రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2024 కి సంబంధించి బెస్ట్ యాక్టర్స్ గా ఈమెకి అవార్డు లభించింది. దీనిపై కామాక్షి భాస్కర్ల స్పందించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉండటం వలన ఢిల్లీకి వెళ్ళలేని ఈవిడ ఒక వీడియోను రిలీజ్ చేశారు.

- Advertisement -

‘‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలో నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచింది. ఈ సందర్భంగా సమహార థియేటర్ లో నాకు నటనను నేర్పించిన నా గురువుగారు రత్న శేఖర్‌గారికి, నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ దీన్ని అంకితమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు కామాక్షి భాస్కర్ల.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు