Salaar: ఆ విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడాలి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా నిరాశ పరిచటంతో  ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ కావటంతో ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలకంటే కంటే కూడా ఈ సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచిన నేపథ్యంలో తాజాగా సినిమా బిజినెస్ విషయంలో వినిపిస్తున్న వార్త ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.

వివరాల్లోకి వెళితే, సలార్ మేకర్స్ ఈ సినిమా థియాట్రికల్ రైట్స్ కోసం భారీ రేట్ కోట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఏపీ, తెలంగాణలో థియాట్రికల్ రైట్స్ 200కోట్ల భారీ మొత్తాన్ని కోట్ చేస్తున్నారట. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ డిజాస్టర్ అయిన నేపథ్యంలో బయ్యర్లు అంత భారీ మొత్తాన్ని పెట్టేందుకు ముందుకు రాకపోవటంతో నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్ కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మరి, సాలార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాను ఓన్ రిలీజ్ చేయటం అన్నది పెద్ద రిస్క్ అని, టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాయం అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ అందుకున్న ప్రభాస్ కి సలార్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరి, రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు