Hanu Raghavapudi: “సీతారామం”.. ది రియల్ క్లాసిక్..

1 year for classic movie SitaRamam

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో చాలా వరకు కమర్షియల్ సినిమాలే ఉంటాయి. అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రమే అందరూ మెచ్చే మంచి సినిమాలు తీస్తారు. అందులోను ప్రతి ప్రేక్షకుడు మెచ్చే ప్రేమకథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రరాజాల్లో ఒకటి “సీతారామం”. ప్రేమకథాచిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడైన హను రాఘవపూడి తీసిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 5న రిలీజ్ అయ్యింది. అంటే నేటికీ సరిగ్గా ఒక సంవత్సరం అయ్యిందన్నమాట.

ఆర్మీ నేపథ్యంలో 70స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేమకథా చిత్రాల్లో ఒక బెస్ట్ మూవీగా నిలిచింది. ఎవ్వరూ లేని ఒంటరి అయిన ఓ ఆర్మీ కుర్రాడికి ఓ యువరాణి నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ దొరికితే ఎంత అందంగా ఉంటుందో, దాన్ని సినిమాగా మలిచి దర్శకుడు ఎంత గొప్పగా అభివర్ణించాడో మాటల్లో చెప్పలేం.

ఇక ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో అలరించారు. రామ్ గా దుల్కర్ ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేసి జీవించాడు. ఇక హీరోని డామినేట్ చేసే రేంజ్ లో మృణాల్ ఠాకూర్ సీతగా, నూర్జహాన్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. వీళ్ళేగాక కీలక పాత్రల్లో నటించిన రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్, శత్రు, గౌతమ్ మీనన్ తదితరులు సినిమా విజయం లో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

ఇక విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఒక్కో పాట ఒక్కో డైమండ్ లా ఉంటుంది. అందుకే ఆ సాంగ్స్ ఎప్పుడు విన్నా మనసుకి హత్తుకుంటాయి.

చివరగా సీతారామం కథ రామాయణ ఇతిహాస పాత్రలని స్ఫూర్తిగా తీసుకుని హనురాఘవపూడి కథగా మలిచిన తీరు అద్భుతం అని చెప్పాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఆ పాత్రలని పరిశీలిస్తే…
రామ్ – రాముడు(దుల్కర్ సల్మాన్),
సీత(నూర్జహాన్) – సీత(మృణాల్ ఠాకూర్)
రాధికా – అహల్య,శబరి(ప్రణీత పట్నాయక్ )
విష్ణుశర్మ – కైకేయి(సుమంత్)
అఫ్రీన్ – వాల్మీకి(రష్మిక)
అబూ తారిఖ్ – విభీషణుడు(సచిన్ ఖడేకర్)
దుర్జయశర్మ – సుగ్రీవుడు (వెన్నెల కిశోర్)
రాహుల్ వర్మ – అంగధుడు(రాహుల్ రవీంద్రన్)

ఇన్ని పాత్రల రిఫరెన్స్ సినిమాలో చూపించినా, అందులో బెస్ట్ అనిపించే పాత్ర గాని, సన్నివేశం గాని ఏది అంటే అంత తొందరగా చెప్ప్పలేము. కానీ సినిమాలో అందరికి ఎక్కువగా నచ్చేది సీత రామ్ తో తన మొదటి పరిచయం గురించి చెప్పే మాట. “కురుక్షేత్రంలో రావణ సంహారం”, “యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం”.

ఈ వాక్యానికి అర్ధం చేసుకునే సరికి సినిమాపై ఇంకా ఇష్టం పెరిగిపోతుంది. ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి మనసున్న ఏ మనిషైనా ఈ కాన్సెప్ట్ కి కరిగిపోతాడు. ఈ మధ్య ప్రతి వాడు మేము క్లాసిక్ తీసాం, కల్ట్ క్లాసిక్ తీసాం అని ఎవరికీ వారు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ “సీతారామం” లాంటి సినిమాలనే కదా రియల్ క్లాసిక్ అని ప్రేక్షకులు  పిలిచేది. ఫైనల్ గా ఇలాంటి గొప్ప సినిమాలు మళ్ళీ రావాలి అని ప్రతి ప్రేక్షకుడు కోరుకునేలా చేసిన చిత్రం “సీతారామం”.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు