Hanu Raghavapudi: కొత్త సృష్టి

హను రాఘవపూడి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో తనదో శైలి.
అందాల రాక్షసి చిత్రం నుండి రీసెంట్ గా వచ్చిన సీతా రామం వరకు ఎక్కువశాతం అన్ని ప్రేమకథా చిత్రాలే. ప్రతి సినిమాకి ఒక ప్రేరణ ఉండటం సహజం. కానీ చాలామంది దర్శకులు ఈ విషయాన్ని ఒప్పుకోరు. అతి తక్కువ మంది మాత్రమే ఎక్కడ నుంచి ఏ సన్నివేశాన్ని ఆధారంగా తీసుకున్నామని చెబుతారు. క్వింటన్ టోరెంటోనో, రామ్ గోపాల్ వర్మ, సుధీర్ వర్మ లాంటి దర్శకులు తమ సినిమా మొదలయ్యే ముందే “నాకు నచ్చిన ప్రతి సినిమా నుండి నేను కాపీ కొడతాను” అని ఒక కార్డు వేసి మరీ చెబుతారు. ఇప్పుడు ఈ కోవలోకే దర్శకుడు హను రాఘవపూడి చేరాడు అని చెప్పొచ్చు.

రీసెంట్ గా హను దర్శకత్వం వహించిన సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబడుతుంది. సీతారామం కథ త్రివిక్రమ్ రాసిన “మల్లీశ్వరి” సినిమా కథకు చాలా దగ్గరగా ఉంటుంది. ఒక యువరాణి సాధారణ అమ్మాయిలా బ్రతకడం, ఆమెను ఒక బ్యాంకు ఉద్యోగి ప్రేమించడం. ఇటువంటి ఛాయలే సీతారామం సినిమాలో కనిపిస్తాయి. అలానే మహానటి సినిమా స్క్రీన్ ప్లే లా సాగుతుంది సీతారామం అని చాలామంది అభిప్రాయం.

ఈ సందేహాలన్నింటికి స్పందించాడు దర్శకుడు. హను రాఘవపూడి ప్రెస్‌తో తన ఆలోచనలను పంచుకుంటూ, సినిమా స్క్రీన్‌ప్లే గురించి కెనడియన్ చిత్రం “ఇన్‌సెండీస్” నుండి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. కానీ మనం నిశితంగా పరిశీలిస్తే, లవ్ స్టోరీ పార్ట్ తప్ప,
“సీతా రామం” మొత్తం ఇంగ్లీష్ సినిమా నుండి తీసుకొచ్చి పెట్టిన అభిప్రాయం కలుగుతుంది చాలామందికి.

- Advertisement -

కెనడియన్ డ్రామా ఫిల్మ్ “ఇన్‌సెండీస్” సినిమాకి ఫేమ్ డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించాడు. చనిపోయిన వ్యక్తి ఒక వీలునామాను ఏర్పాటు చేయడం. చనిపోయిన వ్యక్తి యొక్క వారసులు తెలియని ప్రాంతానికి వెళ్లి రెండు లేఖలను అందజేయాలి. ఆ చిత్రం ముస్లిం-క్రిస్టియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా, సీతా రామం హిందూ-ముస్లిం బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది.

ఇద్దరు పిల్లలు ఇన్‌సెండీస్‌లోని ఉత్తరం ద్వారా తమ తండ్రిని కనుగొనడం వంటి అనేక విషయాలు కనిపిస్తాయి. అలానే యువరాణి నూర్జహాన్‌గా మృణాల్ ఠాకూర్ యొక్క నిజమైన గుర్తింపు ఒక షాక్ ను కలిగిస్తుంది, అదే విధంగా, ఇన్‌సెండీస్‌లో వారు కనుగొనబోయే వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు కూడా షాక్‌ను కలిగిస్తుంది. 2010లో విడుదలైన యుద్ధ నేరాల ఆధారంగా రూపొందిన ఇన్‌సెండీస్‌ను హను ప్రేమకథగా మార్చినట్లు కనిపిస్తోంది, అయితే ఈ చిత్ర కథకు కొంత మంది రచయితలు సహకరించారు. దుల్కర్ మరియు మృణాల్ నటించిన ప్రేమకథా పార్ట్, హైదరాబాద్‌లో ప్రేమలో పడి అనేక ఇతర ప్రదేశాలను సందర్శించడం మరియు వివిధ రేడియో శ్రోతల నుండి ఉత్తరాలు పొందుతున్న అనాథ సైనికుడి ప్రారంభ భాగం ఇవన్నీ హను కొత్త సృష్టి. ఏదేమైనా ఒక యుద్ధ నేరాల ఆధారంగా రూపొందిన కథకు తనదైన పొయిటిక్ టచ్ ఇచ్చి అద్భుతమైన ప్రేమకథగా మార్చడం హను సాధించిన విజయం. ఎక్కడ నుండి ప్రేరణ పొందాను అని హను బహిరంగంగా చెప్పడం హర్షించదగ్గ విషయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు