HBD Trisha Krishnan : త్రిష కెరీర్ ని మార్చేసిన బెస్ట్ మూవీస్ ఇవే..!

HBD Trisha Krishnan : తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ల కింద స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజుల్లో తెలుగు, తమిళం లోనే కాక ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి జోరు చూపించిన ఈ చెన్నై సుందరి కొన్నాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడగా, ఇప్పుడు మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ తో బ్రేక్ అందుకుని వరుస సినిమాలతో బిజీ అయింది త్రిష. రీసెంట్ గా లియో తో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోగా, ఇప్పుడు సౌత్ లోనే సీనియర్ స్టార్ హీరోయిన్లలో బిజీ గా మారింది. ఇక నేడు త్రిష (HBD Trisha Krishnan) బర్త్ డే(మే 4) సందర్బంగా తనకి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ, త్రిష కెరీర్ ని మార్చేసి ఆమె ను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన బెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం..

వర్షం (2004) :

త్రిష ముందుగా తమిళ్ లోనే పరిచయమయింది తమిళ్ లో అయినా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది తెలుగులోనే. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన త్రిష ఆ వెంటనే ప్రభాస్ తో చేసిన వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పెయిర్ కి మంచి మార్కులు పడగా, హీరోయిన్ గా అప్పుడే యూత్ క్రష్ లిస్ట్ లో జాయిన్ అయిపొయింది. ఈ సినిమా తర్వాత త్రిష కి వరుసగా తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ సినిమాతో తొలిసారిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది.

గిల్లి (2004) :

విజయ్ దళపతి త్రిష జంటగా నటించిన తమిళ్ మూవీ గిల్లి. తెలుగు మాతృక ఒక్కడు కి రీమేక్ కా తెరకెక్కిన ఈ సినిమాతో తమిళనాట కూడా స్టార్ హీరోయిన్ అయింది త్రిష. అక్కడ స్టార్ హీరోలతో వరుస ఆఫర్లు అందుకుంది.

- Advertisement -

నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) :

అప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిష కి నటన పరంగా బెస్ట్ ప్రశంసలు లభించిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష ‘సిరి’ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమాకు గాను త్రిష కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలిం ఫేర్ అవార్డు వరించింది.

అతడు (2005) :

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష, ఆ సినిమాలో పూరి గా ప్రేక్షకులని గిలిగింతలు పెట్టింది. చలాకి గా ఉండే ఆ పాత్రలో కుర్రాళ్ళ యెద లోతుల్లోకెళ్లింది.

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే (2007) :

వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా లో త్రిష తన సెటిల్డ్ నటనతో కట్టిపడేయగా ఈ సినిమాకు గానూ బెస్ట్ యాక్ట్రెస్ గా మూడో ఫిలిం ఫేర్ అవార్డుని అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో మరో రెండు చిత్రాల్లో నటించింది.

ఆకాశమంత (2008) :

త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లో తన నటనతో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ కూతురిగా ఈ సినిమాలో నటించగా, తండ్రి కూతుళ్ళ అనుబంధం ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది.

విన్నైతాండి వరువాయా (2010) :

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా, జెస్సి గా తన క్లాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది. ఇక తెలుగు లో ఏ మాయ చేసావే గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

96 (2018) :

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, త్రిష హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన 96 సినిమా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కి అద్భుత విజయం సాధించింది. ఇందులో త్రిష తన కళ్ళతోనే అద్భుతంగా నటించింది.

పొన్నియిన్ సెల్వన్ (2022) :

త్రిష కెరీర్ కి గ్రాండ్ రీ ఎంట్రీ బూస్టప్ ఇచ్చిన ఈ సినిమాలో త్రిష కుందవయి గా యువరాణిగా నటించగా, ఇప్పటికి తన లో గ్లామర్, నటనలో సామర్ధ్యం తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో పోటీ పడి నటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు