Devil movie release date: సేఫ్ గేమ్ ఆడుతున్న కళ్యాణ్ రామ్?

Devil movie release date

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డెవిల్”. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన అమిగోస్ సినిమా డిజాస్టర్ తో దెబ్బతిన్న కళ్యాణ్ రామ్.. డెవిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కాస్త లేటయినా పర్వాలేదని కంటెంట్ సాలిడ్ గా ఉండాలని స్క్రిప్ట్ లో మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

నవీన్ మేడారం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక టీజర్ రిలీజ్ తర్వాత సినిమా పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అయితే ఆ రోల్ నెగిటివ్ రోల్ అని సమాచారం. ఇక తాజాగా డెవిల్ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్.

డెవిల్ సినిమా ని 24 నవంబర్ 2023న రిలీజ్ చేస్తునట్టు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ టైం లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడంలేదు. అందుకే డెవిల్ ని ఆ డేట్ కి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి సోలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇటు టాలీవుడ్ లో అయినా, అటు బాలీవుడ్ లో అయినా దర్శకనిర్మాతలు తమ సినిమాలను పండుగ రోజుల్లో విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అలా దసరా, దీపావళి, సంక్రాంతితో పాటు వివిధ పండుగలు అన్నీ కూడా రెండు నుంచి మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అందరితో కాకుండా, కళ్యాణ్ రామ్ ఎలాంటి పోటీ లేని నవంబర్ చివరి వారంపై టార్గెట్ చేశాడు. ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయి ఉన్న కళ్యాణ్ రామ్‌కి ఇది కొంత మేరకు కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, సౌందర్య రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బింబిసార లో హీరోయిన్ గా అలరించిన సంయుక్త మీనన్ రెండో సారి కళ్యాణ్ రామ్ తో హీరోయిన్ గా నటించింది.

అయితే రీసెంట్ గా స్పై జోనర్ లో వచ్చిన చిత్రాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అఖిల్ నటించిన ఏజెంట్, నిఖిల్ హీరోగా వచ్చిన “స్పై” కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. కానీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. కంటెంట్ బాగుంటే ప్లాప్ సెంటిమెంట్ బ్రేక్ చేసి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు