Rajinikanth’s Jailer movie: ఆ సినిమాలో ఈ ఇద్దరు స్టార్లు గెస్ట్ లు మాత్రమే?

Rajinikanth’s Jailer movie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం “జైలర్”. ఈ సినిమాపై తమిళ్ తో పాటు తెలుగులోను భారీ అంచనాలున్నాయి. గత కొంత కాలంగా రజినికాంత్ నటించిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. అయినప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను “డాక్టర్” లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయడంతో రజినీకాంత్ అభిమానులు సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ పాజిటివ్ బజ్ తో బుకింగ్స్ కూడా సాలిడ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కే 1 మిలియన్ డాలర్ వసూలు చేసేలా ఉంది. ఇదిలా ఉండగా జైలర్ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. మొదట ఇదెవరూ నమ్మకపోయినా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గ్లిమ్ప్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు.

అయితే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో మాత్రం వారు లేరు. దీంతో ఆడియన్స్ కి ఓ చిన్నపాటి కంఫ్యూజన్ వచ్చింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కేవలం గెస్ట్ అప్పీరెన్స్ మాత్రమే ఇచ్చారట. అందులోను వాళ్ళ పాత్ర పది నిమిషాలకి మించి ఉండదట. కానీ సినిమాకి ఆ క్యారెక్టర్ లే మంచి ప్లస్ పాయింట్ గా నిలుస్తాయని సమాచారం. ఏది ఏమైనా ముగ్గురు సూపర్ స్టార్లు నటించినందువల్ల జైలర్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చే వకాశం ఉంది. ఇక ఈ సినిమా ఆగష్టు10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు