Game ChangerLeak : మళ్లీ లీక్… వీడియో మాత్రం అదుర్స్..!

Game Changer Leak : టాలీవుడ్ హీరో రామ్ చరణ్ RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్ డంని సంపాదించుకున్నారు. RRR చిత్రం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని కాస్త ఆలస్యం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో కలిసి భారతీయుడు-2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎక్కువగా ఆ సినిమాకే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కాస్తా ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ నుంచీ వీడియో లీక్..

కానీ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగినా కూడా ఈ చిత్రానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇటీవల శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరొక వీడియో లీక్ అయ్యింది. గతంలో కూడా ఇలాంటి లీకులు ఉండకూడదని నిర్మాతలు సైతం పోలీసులను కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సీన్ వైరల్ గా మారుతోంది. ఇక ఈ లీక్ అయిన వీడియోలో హీరో శ్రీకాంత్, రామ్ చరణ్ ఇద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపిస్తున్నారు.

ఫ్యాన్స్ ఫైర్..

రామ్ చరణ్ శ్రీకాంత్ ని చాలా ఆప్యాయంగా హగ్ చేసుకుని చేతిని పైకెత్తి మరీ చూపించే విధంగా ఈ సన్నివేశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సన్నివేశం ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుందంటూ గతంలో కూడా మేకర్స్ తెలియజేశారు.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులైతే ఫుల్ ఖుషి గా ఉన్నప్పటికీ చిత్ర బృందం కాస్త నిరాశలో ఉంది. మరి కొంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో పైన ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

దిల్ రాజు యాక్షన్ తీసుకుంటారా..

కేవలం కావాలని కొంతమంది ఇలా చేస్తున్నారని.. తమ హీరో సినిమాను డామేజ్ చేసేలా ఇలా చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే ఇలాంటి సన్నివేశాలు లీకైతే.. సినిమా చూడాలన్న ఆసక్తి పోతుంది కచ్చితంగా ఇలాంటివి లీక్ చేస్తున్న వారిపైన వీటిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ పలువురు అభిమానులు కోరుతున్నారు… మరి ఇలాంటి లీకుల పైన దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటివరకు విడుదలైన పాటలు , టైటిల్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. రామ్ చరణ్ కు జోడిగా కీయారా అద్వానీ నటిస్తూ ఉండగా.. అలాగే మరొక హీరోయిన్ అంజలి కూడా ఇందులో నటిస్తోంది.. వీటితోపాటు చాలామంది నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎన్నికయింది.ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తవగా.. మొదటి షెడ్యూల్ కూడా లాంఛనంగా మొదలైనట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు