Thug Life Pic Leak : థగ్ లైఫ్ పిక్ లీక్… న్యూ లుక్ లో కమల్, శింబు

Thug Life Pic Leak : ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే లీకు రాయుళ్ళ కన్ను ఇప్పుడు ఈ మూవీపై పడింది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కమల్ హాసన్ తో పాటు శింబు వంటి ప్రధాన నటులు కన్పిస్తుండడం గమనార్హం.

థగ్ లైఫ్ పిక్ లీక్

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ థగ్ లైఫ్. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న ‘థగ్ లైఫ్’ షూటింగ్‌ కొత్త షెడ్యూల్ లో ప్రధాన నటినటులంతా బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ లో మరో హీరో శింబు కూడా చేరాడు. డైరెక్టర్ మణిరత్నం తన టీమ్‌తో ప్రధాన తారాగణంపై అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే థగ్ లైఫ్ సెట్స్ నుంచి లీకైన ఓ పిక్ మేకర్స్ కు షాక్ ఇచ్చింది. లీకైన పిక్ లో కమల్ హాసన్, శింబు, అభిరామి, నాజర్ తదితరులు ఉండగా, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీలోని ఏరోసిటీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో ‘థగ్ లైఫ్’ బృందం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడి నుంచే ఈ పిక్ లీకయ్యిందని తెలుస్తుంది. అ పిక్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కమల్ హాసన్, శింబునే. ఎందుకంటే వీరిద్దరూ కొత్త లుక్స్ లో దర్శనం ఇచ్చారు. ఒక రకంగా కమల్, శింబు కొత్త లుక్స్ ముందే చూశామనే ఆనందం కలిగినప్పటికి, ఇలా ఫోటోలు లీక్ కావడం అనేది సినిమాపై ఇంట్రెస్ట్ ను తగ్గిస్తుంది కాబట్టి లీక్స్ విషయంలో మేకర్స్ జాగ్రత్త పడాలని కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

- Advertisement -

మే 12 దాకా ఢిల్లీలోనే..

ఏప్రిల్ చివరి వారంలో ‘థగ్ లైఫ్’ టీమ్ ఈ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలో దిగింది. గత రెండు వారాలుగా రాజధాని నగరంలో మణిరత్నం అండ్ టీమ్ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చేస్తున్నారు. సమాచారం ప్రకారం ‘థగ్ లైఫ్’ ఢిల్లీ షెడ్యూల్ మే 12 వరకు కొనసాగుతుంది. మిగిలిన షెడ్యూల్‌లు చెన్నై, ఢిల్లీలో జరుగుతాయి.

36 ఏళ్ల తరువాత కాంబో రిపీట్..

‘థగ్ లైఫ్’ మూవీలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై వొల్టేజ్ యాక్షన్ డ్రామా. సమాచారం ప్రకారం కమల్ ఈ చిత్రంలో మూడు పాత్రలు పోషిస్తాడు. ఇక ఈ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ మూవీలో శింబు, దుల్కర్ సల్మాన్, జయం రవి, త్రిష, గౌతం కార్తీక్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ ‘థగ్ లైఫ్’ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు