RRR Re release : ఆర్ఆర్ఆర్ రీరిలీజ్… థియేటర్లలోకి రాబోయేది ఎప్పుడంటే?

RRR Re release : దర్శక దిగ్గజం రాజమౌళి ఎపిక్ పీరియడ్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇంకా రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడంతో రికార్డులు బ్రేక్ చెయ్యడానికి ఆర్ఆర్ఆర్ కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే?

రెండేళ్లయినా తగ్గని క్రేజ్

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా, ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కు ఆస్కార్‌తో సహా అనేక అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు సంవత్సరాల తరువాత కూడా ఇంకా ఏదో ఒక వేదికపై ప్రదర్శించబడుతూనే ఉంది. ఇప్పటికీ అభిమానులు, విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంటోంది.

రీరిలీజ్ డేట్ ఏంటంటే?

వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలో దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రత్యేక ప్రదర్శన కోసం జపాన్ వెళ్ళారు. తాజా అప్‌డేట్‌లో నార్త్ లోని ట్రిపుల్ ఆర్ పంపిణీదారులు, పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారతదేశంలో తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేశారు. అయితే రీ-రిలీజ్ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మూవీ రీరిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ని థియేటర్లలో మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్త ఇటు చెర్రీ, అటు తారక్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ ను నింపుతోంది.

- Advertisement -

ట్రిపుల్ ఆర్ స్టోరీ..

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రాజమౌళి రూపొందించిన ఎపిక్ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్. ఈ చిత్రం భారతీయ స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కగా, అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ అనే ఇద్దరు విప్లవకారుల కల్పిత కథ చుట్టూ తిరుగుతుంది. రామ్, భీమ్ మధ్య స్నేహం వైరంగా ఎలా మారింది? వారి స్నేహం, బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా వారు ఎలా పోరాడారు అనే కథనాన్ని మనసుకు హత్తుకునేలా, పవర్ ఫుల్ గా చూపించారు రాజమౌళి.

ఆస్కార్ తెచ్చిపెట్టిన నాటు నాటు

ఈ మూవీలోని నాటు నాటు పాట అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అంతేకాదు ఈ పాట ఉత్తమ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణికి ఆస్కార్ అవార్డును కూడా సంపాదించి పెట్టింది.

ట్రిపుల్ ఆర్ లో అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు.

కాగా రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB29 మూవీ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతోంది.

రామ్ చరణ్ విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌ అనే పొలిటికల్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రం దేవర చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు