BholaShankar: వాళ్ళిద్దరికీ చెల్లిగా నటించడం నా అదృష్టం- కీర్తి సురేష్

BholaShankar

టాలీవుడ్ లో ఈ వారం మోస్ట్ అవైటెడ్ మూవీగా “భోళా శంకర్” సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా, పాటలు, ట్రైలర్ల పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.

ఇక సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి కీర్తి సురేష్ ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూ లో కీర్తి సురేష్ కి మెగాస్టార్ చిరంజీవి తో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగాడు. దీనికి కీర్తి సురేష్ బదులిస్తూ రజనీకాంత్ తో పెద్దన్న సినిమా పూర్తిచేసిన తర్వాత భోళా శంకర్ ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ తో నటించాను. ఇంతకంటే ఏం కావాలి, చాలా హ్యాపీగా వుంది అని అంది.

ఇక భోళాలో మరో గొప్ప విశేషం.. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దొరికింది. చిరంజీవి గారితో ఒక్క ఫ్రేమ్ లోనైనా డ్యాన్స్ చేయాలని వుండేది. కానీ ఇందులో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది అని కీర్తి సురేష్ తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. ఇక భోళా శంకర్ సినిమా ఆగష్టు 11 న రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, ఆగష్టు 6న శిల్పకళావేదిక లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మెగా స్టార్ చిరంజీవి సహా విచ్చేయనున్నారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు