Gunturukaaram: స్టార్ హీరోయిన్గా మారిన శ్రీ లీల… ఆ పనులు చేస్తుందా ?

Gunturukaaram

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీ లీలనే కనిపిస్తోంది, వినిపిస్తోంది. యువత దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకు ఈ బ్యూటీ పేరే తలచుకుంటున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో పలువురు హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్ల వయసు 30 ఎప్పుడో దాటేసింది.

కొంతమంది 30లోపు ఉన్నప్పటికీ స్టార్ హీరోల రేంజ్ ని వాళ్ళు మ్యాచ్ చేస్తారా అనేది డౌట్. ఇలాంటి సమయంలో శ్రీ లీల… స్టార్ హీరోల సినిమాల్లో వరస పెట్టి ఛాన్సులు కొట్టేస్తోంది. సాధారణంగా ఓ హీరోయిన్ చేతిలో 2-3 సినిమాలు ఉండడం చాలా గొప్ప. అలాంటిది ఇన్ని సినిమాలంటే ఎక్కడో గట్టిగా రాసిపెట్టినట్లే. కాగా, తెలుగులో తొలి సినిమా ‘పెళ్లి సందD’ లో క్యూట్ స్టెప్పులేసింది.

ధమాకాలో మాత్రం రెచ్చిపోయి మరి డ్యాన్సులతో దుమ్ము దులిపింది. ఈ పాయింట్ కూడా శ్రీ లీలకు బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. అయితే శ్రీ లీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాకు అధిక మొత్తంలో పారితోషకం తీసుకుంటుంది. అలాగే కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ భారీగానే సంపాదిస్తుంది. అంతేకాదు ఆమె సంపాదించిన డబ్బు ఆమె దత్తత తీసుకున్న పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తుందని సమాచారం. అయితే ఏది ఏమైనప్పటికీ ఈమె నిర్ణయాలు ఆలోచనలు నిజంగా గొప్పవి అంటూ చాలామంది నెటిజన్లు శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు