Actress Shruti Haasan: ప్రభాస్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి?

Actress Shruti Haasan

హీరోయిన్‌ శృతి హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ ఈ మధ్యకాలంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే పలు సినిమా కథలను ఎంపిక చేసుకుని సక్సెస్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

అంతే కాకుండా ఈమె కెరియర్ లో ఎప్పుడు లవ్ ఎఫైర్లతోనే వార్తల్లో తరచూ నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి శృతిహాసన్. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా శృతిహాసన్ తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగమవుతున్నది. నాని నటిస్తున్న 30వ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ తరుణంలోనే ఆమె ఒక అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతుందట. ఈ వ్యాధి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలుస్తోంది.

- Advertisement -

కాస్త ఒత్తిడి పెరగగానే ఆమెకు తెలియకుండానే ఇతరులపై విపరీతమైన కోపానికి వచ్చి కాస్త హడావిడి చేస్తుందట. ఆ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతుందట. నరాలు చిట్లిపోయేంత కోపంతో ఇతరులపై అరుస్తుందట. ఈ వ్యాధి వల్ల తనలో తానే బాధపడుతుందని… దాని నుంచి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు