Apsara Rani: ఆ తెలుగు హీరో కోరిక తీర్చమన్నాడు.. అప్సర రాణి కామెంట్స్ వైరల్..!

Apsara Rani

అప్సర రాణి.. సినీ ప్రేక్షకులకు ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా ఈ అమ్మడు లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆర్జీవి తెరకెక్కించిన ‘థ్రిల్లర్’ మూవీలో నటించి కుర్రకారును ఉర్రూతలూగించింది అప్సర రాణి. ఆ తరువాత డేంజరస్, రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి అందాలు ఆరబోసింది. ఇదే కాకుండా సుధీర్ బాబు హంట్ మూవీలో కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది.
ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అంకిత మహారాణా. కానీ వర్మ అప్సర రాణిగా నామకరణం చేశాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. ఎప్పుడూ తన హాట్ అందాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్సర కాస్టింగ్ కౌచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. సినిమాలలోకి వచ్చిన కొత్తలో తనని చాలామంది కమిట్మెంట్ అడిగారట.
కానీ వాటికి తాను ఒప్పుకోలేదని.. అలా ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉండే దానినని తెలిపింది. ఇక ఇటీవల కూడా ఓ తెలుగు హీరో తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడని.. కానీ తన కోరిక తీర్చాలని తన మేనేజర్ తో అడిగించాడని చెప్పింది. అది తనకు నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశానని తెలిపింది. ఇక తనకి ఇండస్ట్రీలో త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరని ఇప్పుడు నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు