Mahanati: తన ప్రమేయం లేకుండానే ఓ క్లినిక్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన నటి?

కీర్తిసురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మహానటి లో సావిత్రి గా మెప్పించి తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఈ హీరోయిన్ ఈ మధ్యనే దసరా సినిమా తో సూపర్ హిట్ కొట్టి జోరు మీదుంది కీర్తి సురేష్. ప్రస్తుతం భోళా శంకర్ లో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్న కీర్తి వరుస ఆఫర్లతో సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. తమిళం లో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది కీర్తి సురేష్. ఇటు సినిమాలు చేస్తూనే అటు సోషల్ మీడియా లోను యాక్టీవ్ గా ఉంటుంది కీర్తి. తాను ఏ సినిమా చేస్తున్నా ఇంకా ప్రోగ్రామ్స్ కి వెళ్తున్నా ప్రతి లొకేషన్ ని షేర్ చేస్తూ ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్లలో సందడి చేస్తుంది.

తాజాగా కీర్తి సురేష్ తన గురించి ఒక ఆసక్తికరమైన ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ గా పెట్టింది. కీర్తి సురేష్ పలు కంపెనీ లకు యాడ్ లు చేసి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచినా విషయం తెలిసిందే. ఎక్కువగా జ్యూవెల్లరీ యాడ్స్ లో నటించే కీర్తి ఇప్పుడు ఒక క్లినిక్ యాడ్ లో నటించింది. అది కుడా తన ప్రమేయం లేకుండానే.

వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా కీర్తి ఈ విషయం పైనే ఆ స్టేటస్ పెట్టింది. తమిళనాడు లో ఉడుమల్ పేట్ అనే ఊరులో ఓకే డాక్టర్ తన క్లినిక్ కు డిమాండ్ పెరగాలని కీర్తి సురేష్ ఫోటోను ప్లెక్సీ గా డిజైన్ చేసి అందులో కీర్తి కి చేతి బోన్ కి కట్టు కట్టినట్లు ఉంది. ఈ ఫ్లెక్సీ ని కీర్తి ఫోటో తీసి సరదాగా స్టేటస్ పెట్టింది. జీరో బడ్జెట్ తో కీర్తి సురేష్ “బోన్ జాయింట్ క్లినిక్” కు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిందని తన ఫొటో పెట్టి ఫన్నీ గా స్టేటస్ పెట్టింది. ఇలాంటి ఐడియా లు ఎలా వస్తాయి అని స్టేటస్ లో రాసి ఉంది. ఈ స్టిల్ ఇన్స్టా లో మీమ్స్ వేసేవాళ్ళకి మంచి బూస్టప్ మారుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు