NTR30 : మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిన జాహ్నవి కపూర్

జాహ్నవి కపూర్ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమా పూర్తి అవకుండానే తెలుగులో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్30 సినిమాలో మొదటగా అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకున్న మేకర్స్, లుక్ టెస్ట్ చేసి అంత ఫైనల్ అయిపోయిన తరువాత సరిగ్గా షూట్ మొదలయ్యే సమయానికి అలియా భట్ పెళ్లి కారణంగా ఆమె ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ పక్కన ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ లో పడిపోయిన మూవీ టీం జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. RRR సినిమా వాళ్ళ లాంగ్ బ్రేక్ వచ్చిన ఎన్టీఆర్30 సినిమాకి జాహ్నవి రాగానే అదృష్టం కలిసి వచ్చిందో ఏమో గాని వెంటనే షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ని షూట్ చేసిన మూవీ యూనిట్ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసారు. రెండో షెడ్యూల్ లో భాగంగా జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ మధ్య లవ్ సీన్స్ తెరకెక్కించారు కొరటాల శివ .

ఇలా ఒక పక్క ఎన్టీఆర్ సినిమా షూట్ లో బిజీ గా ఉన్న జాహ్నవి కి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అదేంటంటే.. అఖిల్ అక్కినేని హీరోగా కొత్త దర్శకుడు అనిల్ ని పరిచయం చేస్తూ యూవీ క్రియేషన్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా జాహ్నవి కపూర్ ని తీసుకోబోతున్నరంట. ఈ సినిమా ఫాంటసీ బ్యాక్డ్రాప్ ఉండబోతుందట. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా నిరాశపరచడంతో అఖిల్ వీలైనంత తొందరగా ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నరంట. అందుకే పెద్ద, పెద్ద దర్శకులతో పని చేసి, అలసిపోయిన అఖిల్ ఈసారి డెబ్యూ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. మరి ఈ కొత్త దర్శకుడైన అఖిల్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు