Divya Pillai:75 కేజీ ల వ్యక్తి పైన పడి.. షాకింగ్ విషయాలు చెప్పిన మంగళవారం నటి..!

Divya Pillai.. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మంగళవారం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథాంశం తో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఒక్క పాయల్ రాజు పుత్ కి మాత్రమే కాదు ఇందులో నటించిన చాలామందికి మంచి గుర్తింపును అందించింది.. ఇక అలా ఈ సినిమాలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో నటి దివ్య పిళ్లై కూడా ఒకరు.. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పల్లెటూరు నేపథ్యంలో అక్రమ సంబంధాల చుట్టూ అల్లుకున్న కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తర్వాత అంతగా హైలైట్ అయిన పాత్ర జమిందారి భార్య పాత్ర ఈ పాత్రలో మలయాళీ ముద్దుగుమ్మ దివ్య పిళ్ళై నటించారు.

Divya Pillai: Tuesday actress who fell on top of a 75 kg man and said shocking things..!
Divya Pillai: Tuesday actress who fell on top of a 75 kg man and said shocking things..!

జమీందార్ భార్య గా గుర్తింపు..

ఈ సినిమా విడుదలవక ముందు ఈమె పాత్ర గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ విడుదలైన తర్వాత ఈమె పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. పవిత్రంగా కనిపిస్తూ.. గుళ్ళు తిరుగుతూ.. పూజలు చేస్తూ సంప్రదాయంగా కనిపించే జమీందారి భార్య ఒక్కసారిగా క్లైమాక్స్లో విలన్ గా మారిపోయి భారీ ట్విస్ట్ ఇవ్వడం సినిమాకే హైలెట్ గా నిలిచింది.. పనిమనిషితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో నటించిన దివ్య పిళ్లై ఈ సినిమాలో శృంగార సన్నివేశాలలో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. గతంలో కూడా ఈమె కొన్ని చిత్రాలలో శృంగార సన్నివేశాలలో నటించి ఆశ్చర్యపరిచింది. ఇక మంగళవారం చిత్రంలో తన అద్భుతమైన నటన కనబరిచి తన పాత్రతో మరింత పేరు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

75 కేజీల వ్యక్తి మీద పడితే..

ఇంటర్వ్యూలో భాగంగా దివ్య మాట్లాడుతూ.. అందరి ముందు శృంగార సన్నివేశాలలో నటించడం అంత సులభమైన విషయం కాదు.. దాదాపు 75 కేజీల బరువు ఉన్న మనిషి తనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకి కనిపించే విధంగా రొమాంటిక్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆ టైంలో ముద్దు సీన్ లో నటిస్తుంటే ముద్దు భలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటిది ఉండదు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ .రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో చాలా వర్క్ అవుట్ చేయాలి. ఎలా నటించాలి అనేది కో ఆర్టిస్ట్ తో కలిసి ముందే చర్చించుకోవాలి. అప్పుడే సీను బాగా పండుతుంది లేకపోతే ఎక్కువ టాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది .. ముఖ్యంగా ఇబ్బంది పడ్డా కూడా ఆ ఫీలింగ్ ని ముఖంలో చూపించకూడదని స్పష్టం చేసింది.. మంగళవారం చిత్రంతో భారీ క్రేజ్ దక్కించుకున్న దివ్య పిళ్లై ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఏది ఏమైనా మంగళవారం సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు