Shruti Hassan: మళ్లీ బ్రేకప్.. సారీ అంటూ బాయ్ ఫ్రెండ్ క్లారిటీ..!

Shruti Hassan.. విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ఏ రోజు కూడా తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకోకుండా తన సొంత తెలివితేటలతో సినీ ఇండస్ట్రీలో ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది. అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలు చేసింది కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో కొన్నాళ్లు ఐరన్ లెగ్ అనిపించుకొని తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిన ఈమె మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా ఈమె కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఆ తర్వాత పోలీసులు సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ స్టేటస్ అందుకున్న శృతిహాసన్.. గత ఏడాది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాలో హీరోయిన్గా నటించి పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఇదే విషయాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా స్పష్టం చేశారని సమాచారం.. మరి అసలు విషయం ఏమిటో చూద్దాం..

Shruti Hassan: Breakup again.. Saying sorry boyfriend clarity..!
Shruti Hassan: Breakup again.. Saying sorry boyfriend clarity..!

బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్..

ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్.. గూగుల్ యొక్క డూడుల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న శాంతను హజారికాతో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. అంతేకాదు గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండే ప్రతి క్షణాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ.. తమ ఇద్దరి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉందో తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరు కూడా తమ అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్స్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీళ్ళ మధ్య బ్రేకప్ వార్తలు బయటకు వచ్చాయి.

బ్రేకప్ పై శాంతాను హజారికా క్లారిటీ..

గతంలో శాంతాను హజారికా తో శృతిహాసన్ ప్రేమలో ఉందని.. పెళ్ళికూడా చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి.. అయితే ప్రేమిస్తున్న మాట నిజమే కానీ పెళ్లి వరకు ఇంకా వెళ్ళలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.. కానీ ఇప్పుడు బ్రేకప్ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం.. కానీ ఈమె బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికా తాజాగా తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు..నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను.. నేను ఇంకా ఈ బ్రేకప్ విషయంపై వ్యాఖ్యానించదలచుకోలేదు.. అంటూ బాంబే టైమ్స్ తో తెలిపారు.. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వ్యక్తిగత విభేదాలు ఉండడం వల్ల స్నేహ పూర్వకంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

- Advertisement -

శృతిహాసన్ కామెంట్..

ఇకపోతే శృతిహాసన్ ఈ విషయంపై స్పందించలేదు.. కానీ ఇటీవల తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో.. ఇది ఒక క్రేజీ రైడ్.. నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి కూడా నేను చాలా నేర్చుకున్నాను.. అంటూ షేర్ చేసింది.. ఆపై తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు పోస్ట్లను కూడా డిలీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ..

అంతకు ముందు మరో బ్రేక్ అప్..

ఇదిలా ఉండగా శాంతను హజారికా తో ప్రేమలో పడక ముందే ఈమె లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్ తో ప్రేమలో పడింది . అతనితో కొంతకాలం డేటింగ్ చేసి సడన్గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది ..అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లవ్ స్టోరీకి కూడా ఎండ్ కార్డు పలకడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు