Panchayat Season 3 : విలేజ్ డ్రామా అప్డేట్ అంటూ బకరాలను చేసిన ప్రైమ్ వీడియో

Panchayat Season 3 : పంచాయత్ సీజన్ 3 వెబ్ సిరీస్ కోసం ఓటిటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో అప్డేట్ ఇస్తాము అని చెప్పి ఊరించి, ఆడియన్స్ ను బకరాలను చేసింది. ఇంతకీ పంచాయతీ సీజన్ 3 విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇచ్చిన అప్డేట్ ఏంటి? అంటే….

రిలీజ్ ఇవ్వకుండా టీజ్ చేసిన అమెజాన్..

పంచాయతీ వెబ్ సిరీస్ కు మంచి ప్రేక్షకుదరణ దక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడవ సీజన్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా రిలీజ్ చేసింది ప్రైమ్ వీడియో. అందులో భాగంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓపెన్ చేయొద్దండి… లోపల పంచాయతీ సీజన్ 3 డేట్ ఉంది అనే పేపర్ రిఫ్రిజిరేటర్ పై అంటించి ఉన్నట్టుగా అందులో కనిపించింది. అయితే ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపల అన్నీ సొరకాయలే కనిపించాయి. ట్రై చేశారుగా అంత సింపుల్ కాదు… స్టే ట్యూన్డ్” అంటూ అందరినీ బకరాలను చేసేసారు.

ప్రైమ్ వీడియో వివరణ..

త్వరలోనే పంచాయతీ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడిస్తాము అంటూ ప్రైమ్ వీడియో వారు వివరణ ఇచ్చారు. కాస్త నిరీక్షిస్తే పంచాయత్ సీజన్ 3 కొత్త రిలీజ్ డేట్ దొరుకుతుంది అంటూ రాసుకొచ్చారు. ఏదైతేనేం త్వరలోనే పంచాయత్ సీజన్ 3 వస్తే చాలు అంటూ సంబరపడిపోతున్నారు ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లు. కానీ మరికొంత మంది మాత్రం అటెన్షన్ గ్రాబ్ చెయ్యడానికి ఆడియన్స్ ను బకరాలను చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పంచాయత్ సీజన్ 3 వెబ్ సిరీస్ కు ఫుల్ క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఐపీఎల్ 2024 సీజన్ అడ్డుగా ఉంది. అందుకే ఈ సీజన్ పూర్తయ్యాక పంచాయత్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయాలి అని అమెజాన్ అనుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది కాబట్టి మే చివర్లో లేదా జూన్ మొదట్లో రిలీజ్ చేస్తారని బజ్ నడుస్తోంది. మరి ప్రైమ్ వీడియో పంచాయత్ సీజన్ 3 వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.

మొదటి రెండు సీజన్ల రిలీజ్ డేట్స్..

పంచాయత్ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రను పోషించగా, మూడో సీజన్ లో ఆయనతో పాటే రఘువీర్ యాదవ్, నీనా గుప్తా, సన్విక, పైజల్ మాలిక్, చందన్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కు దీపక్ మిశ్రా దర్శకత్వం వహించగా, ది వైరల్ ఫీవర్ పతాకంపై శ్రేయాన్స్, పాండే, విజయ్ కోషి, అర్నాబ్ కుమార్ నిర్మించారు. కాగా ఫస్ట్ సీజన్ 2020 ఏప్రిల్ 3న, సెకండ్ సీజన్ 2022 మే 20న రిలీజ్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు