Love Guru on OTT : మూడు వారాల్లోనే ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ మూవీ… తెలుగు సంగతేంటి?

Love Guru on OTT :  తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన రోమియో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ ఏ ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే….

తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోని, మృణాళిని రవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లవ్ గురు. ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చింది. తమిళంలో రోమియోగా, తెలుగులో లవ్ గురు పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే స్టోరీ రొటీన్ గా ఉందనే నెగటివ్ కామెంట్స్ మధ్య ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ ఆహా తమిళ ఓటీటీ ప్లాట్ఫారం అప్డేట్ ఇచ్చింది. సమాచారం ప్రకారం ఈ మూవీ మే 3 నుంచి తమిళంలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇంకా ఆహా తమిళ్ ఓటిటి నుంచి ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తానికి థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది ఈ మూవీ.

లవ్ గురు స్టోరీ ఇదే…

మలేషియాలో బిజినెస్ చేసే అరవింద్ ఇండియాలోని తన సొంత గూటికి తిరిగి వచ్చి, లీల అనే అమ్మాయిని చూసి ఇష్టపడతారు. ఆ తర్వాత వీళ్ళ పెళ్లి జరుగుతుంది. కానీ ఆమెకు తనంటే ఇష్టం లేదని అరవింద్ కు తెలుస్తుంది. తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవడానికి పెళ్లి చేసుకున్న లీల మనసు గెలుచుకోవడానికి అరవింద్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ లీలకు మాత్రం హీరోయిన్ కావాలని ఉంటుంది. మరి ఇంతకీ వీళ్లిద్దరి బంధం ఎలా ముగిసింది? లీలా కల నెరవేరిందా లేదా అనేదే లవ్ గురు మూవీ స్టోరీ.

- Advertisement -

తెలుగు వెర్షన్ ఓటీటీ సంగతేంటి?

లవ్ గురు మూవీ తమిళ ఓటిటి స్ట్రీమింగ్ పై తమిళ ఆహా ప్లాట్ఫామ్  క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ మూవీ తెలుగులో ఎప్పుడు ఓటీటీ లోకి రాబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. లవ్ గురు మూవీ తెలుగు స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా దగ్గర కూడా ఉండడంతో అసలు ఈ మూవీ ప్రైమ్ వీడియోలో వస్తుందా లేదంటే ఆహాలో రిలీజ్ అవుతుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. లేదంటే రెండింటిలోనూ ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లవ్ గురు తెలుగు వర్షన్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ మూవీని డైరెక్టర్ వినాయక విశ్వనాథన్ తెరకెక్కించగా, మీరా అంటోనీ నిర్మించారు. భరత్ ధనశేఖర్ సంగీతం అందించగా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి ఈ కన్ఫ్యూజన్ కు ఏ ఓటీటీ సంస్థ ఎప్పుడు తెర దించుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు