Irfan Khan: ఒకప్పుడు మెకానిక్.. ఆ ఇంట్లో ఏసీ బిగించడానికి వెళ్లి స్టార్ అయిపోయాడు.. !

Irfan Khan:  బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఉంటారు. ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేస్తే చాలు స్టార్ నటులుగా మారిపోతూ ఉంటారు. అయితే ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది బ్యాగ్రౌండ్తో వచ్చిన వారు ఉంటారు. మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అయితే… బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన నటులలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు.

బాలీవుడ్ బడా నటుడు ఇర్ఫాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజస్థాన్లో పుట్టి పెరిగిన ఈ బడా స్టార్ నటుడు… ది నేమ్ షేక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగుపెట్టాడు. ఆ తర్వాత సలాం బాంబే, కమలాకి మౌత్, ఏక్ డాక్టర్ కి మౌత్ లాంటి ఎన్నో సినిమాలు చేసి బంపర్ హిట్ అందుకున్నాడు ఇర్ఫాన్ ఖాన్. ఇక ఇర్ఫాన్ ఖాన్ పర్సనల్ విషయానికి వస్తే… అతడు 1995 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు.

1995 సంవత్సరంలో సుతాప సెక్టార్ తో ఇర్ఫాన్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే… తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో కీలకపాత్ర చేసి అందరిని మెప్పించాడు ఇర్ఫాన్ ఖాన్. ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు ఇర్ఫాన్ ఖాన్.

- Advertisement -
irfan-khan-life-style

అయితే పెద్ద పేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ 2020 సంవత్సరం ఏప్రిల్ 29 వ తేదీన ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మరణించారు. అతనికి అంతకు ముందు క్యాన్సర్ కూడా ఉండేది. అయితే వాస్తవానికి ఇర్ఫాన్ ఖాన్ ఒక నటుడిగా రాణించాలని అనుకోలేదట. సినిమాలలోకి రాకముందు ఇంట్లో ఏసీలు బిగించేవాడట ఇర్ఫాన్ ఖాన్. అయితే అదే సమయంలో అతను నాటకాలలో కూడా పాల్గొనే వాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. irfan-khan-life-style

జోధాపూర్ లో థియేటర్ ఆర్టిస్ట్ అయిన తన మామ ప్రేరణతో నటన వైపుకు ఇర్ఫాన్ ఖాన్ వచ్చాడు. అంతేకాదు 1994 సంవత్సరం కాలంలో… ఢిల్లీలోని ఓ ప్రముఖ స్కూల్లో చిన్నపాటి ఉద్యోగం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే 300 రూపాయల జీతం కూడా అతను తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబైకి వెళ్లి కొన్ని రోజులు ఏసీ రిపేర్ మెన్ గా పనిచేశాడు ఇర్ఫాన్ ఖాన్. ఇదే సమయంలో నటుడు రాజేష్ కన్నా ఇంటికి ఒకానొక సమయంలో ఏసీ బిగించడానికి ఇర్ఫాన్ ఖాన్ వెళ్లాడట. అక్కడ రాజేష్ కన్నా ను కలిసిన తర్వాత సినిమాలలోకి రావాలని ఇర్ఫాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నాడట. ఆ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇర్ఫాన్ ఖాన్…ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. కాగా ఇర్ఫాన్ ఖాన్ చివరగా అంగ్రేజీ మీడియం సినిమా చేశాడు. irfan-khan-life-style

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు