Star Hero : 300 రూపాయలతో వచ్చి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు… ఇది కదా ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే

Star Hero : సినిమా ఇండస్ట్రీ అనగానే అద్భుతంగా ఉండే రంగుల ప్రపంచం కళ్ళ ముందు కదలాడుతుంది. కానీ అక్కడ స్టార్స్ గా నిలదొక్కుకోవడానికి హీరోలు హీరోయిన్లు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. అందరూ ఆ కష్టాలను తట్టుకుని స్టార్స్ గా ఎదిగి, రాబోయే తరాలకు స్పూర్తిగా నిలవలేరు.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్న ఓ హీరో అప్పట్లో కేవలం 300 జేబులో పెట్టుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్న ఆ హీరో జర్నీ ఎన్నో కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ స్టార్ ఎవరు అంటే రాఖీ భాయ్ గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న కన్నడ స్టార్ యష్.

గవర్నమెంట్ ఉద్యోగాన్ని కాదని ప్రయాణం…

ఒకప్పుడు శాండల్ వుడ్ లో నటుడిగా స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఈ స్టార్ హీరో. కర్ణాటకలోని హాసన్ అనే ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అప్పట్లో ఆయన తండ్రి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ గా పని చేస్తే, తల్లి మాత్రం గృహిణిగా ఉండేది. ఇలాంటి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ లో పెరిగిన యష్ అప్పట్లోనే తాను నటుడిగా మారాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దానికోసం ఏకంగా చదువును కూడా పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యాడట. కానీ తల్లిదండ్రుల కోరిక మేరకు చదువును పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత సినీ కెరీర్ ని కొనసాగించడం అంటే కష్టంతో కూడుకున్న పని, లక్కు ఉంటేనే అక్కడ స్టార్స్ గా ఎదగగలరు అనే ఉద్దేశంతో ఆయన పేరెంట్స్ యష్ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకున్నారట.

- Advertisement -

తిరగి రావొద్దన్న తండ్రి..

యష్ మాత్రం పట్టు విడవకుండా 16  ఏళ్ల వయసులోనే బెంగళూరుకు వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న తమ కోరికను పట్టించుకోని కొడుకుకు అనుకున్నది సాధించకుండా ఇంటికి తిరిగి రావద్దు అంటూ కఠినమైన కండిషన్ పెట్టారట యష్ తండ్రి. అయినప్పటికీ తగ్గకుండా అప్పట్లో 300 రూపాయలతో ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలి అనే కలలతో బయలుదేరాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా..

స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన యష్ ఒకానొక సమయంలో సీరియల్స్ లో కూడా నటించాడు. ఆ తరువాత ఈ హీరో ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు దక్కించుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చి కేజిఎఫ్ లో భాగం కావడం, ఆ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యి సంచలనం సృష్టించడంతో ఈ హీరో ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడు 300 చేతిలో పట్టుకుని వచ్చిన ఈ స్టార్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 200 కోట్ల పారితోషకం అందుకునే రేంజ్ కి ఎదిగి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు.

పాన్ ఇండియా నిర్మాతగా..

అంతేకాకుండా తన అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారాడు. ఇప్పుడు ఆయన కేవలం పాన్ ఇండియా హీరోనే కాదు టాక్సిక్, రామాయణం వంటి మాసివ్ సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఆయనకు నిర్మాతగా 50-50% పార్టనర్షిప్ ఉంది. ఇది కదా అసలైన ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు