GamGamGanesha: “గం గం గణేశా” రిలీజ్ డేట్ ఫిక్స్

GamGamGanesha in theaters from May 31st: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే… మరికొంతమంది… తమ బ్యాగ్రౌండ్ వినియోగించుకొని ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాగే కొంతమంది బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఏమాత్రం రాణించడం లేదు. అలాంటి వారిలో చాలామంది హీరోలు ఇప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతున్నారు.

అదే సమయంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కొంతమంది బంపర్ హిట్ సినిమాలు అందుకుంటున్నారు. అయితే తన అన్నయ్య బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అండదండలతో… ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.GamGamGanesha in theaters from May 31st

GamGamGanesha in theaters from May 31st
GamGamGanesha in theaters from May 31st

మంచి కంటెంట్ అలాగే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సినిమాలు మాత్రమే ఆనంద్ దేవరకొండ చేస్తారు. అలా ఇప్పటికే తన కెరీర్లో వరుసగా సినిమాలను చేశాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ దేవరకొండ కంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలోనే ఆనంద్ దేవరకొండ బేబీ అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉంది. టీవీలో వచ్చినా కూడా జనాలు వదలడం లేదు.

- Advertisement -

అలాంటి బంపర్ హిట్ సినిమా చేసిన తర్వాత ఇప్పుడు గం గం గణేశా సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ గం గం గణేషా సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా నటిస్తోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో వస్తోంది.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా గం గం గణేశా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. మే 31వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు విచిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది ఈ చిత్ర బృందం. ఇందులో హీరో ఆనంద్ దేవరకొండ గన్ ఫైర్ చేస్తున్నట్లు చూపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు