Anupama Parameswaran New Movies : లిల్లి కి అవకాశాలు మళ్లీ మళ్లీ… అంతా టిల్లు వల్లే

Anupama Parameswaran New Movies : హీరోయిన్లకు ఎంత మంచి పేరున్నా… మంచి క్రేజ్ ఉన్నా… ఒక సినిమా హిట్ అయితే అందులోని పాత్ర పేరుతో పిలవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలా ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌కు జరుగుతుంది. అనుపమకు నిజానికి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన టిల్లు స్వ్కేర్‌తో అది మరింత పెరిగింది. అంతే కాదు, ఈ టిల్లు మూవీ వల్ల అనుపమకు చాలా వచ్చాయి. అందులో ఒకటి లిల్లి పేరు అయితే మరొకటి అవకాశాలు.

టిల్లు స్వ్కేర్ రిలీజ్ తర్వాత అనుపమకు బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హనుమాన్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాల్లో ఆక్టోపస్ ఒకటి. ఇందులో ఈ లిల్లి (అనుపమ) కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే పరదా అనే ఓ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీనిలో అనుపమనే ప్రధాన పాత్ర.

వీటితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీగా ఓ సినిమా ఫిక్స్ అయిందట. అలాగే, యంగ్ హీరో కార్తికేయాతో చావు కబురు చల్లగా అనే సినిమాకు దర్శకత్వం వహించిన కౌశిక పెగళ్లపాటి ప్రస్తుతం ఫాంటాసీ థ్రిల్లర్ జానర్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అనుపమనే లీడ్ క్యారెక్టర్ గా ఫిక్స్ అయిందట. ఈ సినిమాకు కిష్కిందపురి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇలా అనుపమ చేతి నిండా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వీటితో పాటు కన్నడలో ఓ సినిమా రిలీజ్ కు ఉంది ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, కెరీర్ మరింత బాగుంటే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు