Vishal : మార్క్ ఆంటోనీ టు రత్నం కలెక్షన్స్.. శిఖరం నుండి నేలపైకి!

Vishal : కోలీవుడ్ స్టార్ విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా తర్వాత నటించిన సినిమా “రత్నం”. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన రత్నం మూవీ ఎప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో కలిపి గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక వీరి కాంబోలో ఇంతకు ముందు భరణి, పూజ లాంటి హిట్ సినిమాలు రాగా, ఇప్పుడు రత్నం సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రిలీజ్ అయింది. అయితే విశాల్ రత్నం మూవీ అనూహ్యంగా ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ కమర్షియల్ డ్రామా అని, సినిమాలో ఏమాత్రం సరైన కథా, కథనాలు లేవని హరి పాత సినిమాల మాదిరే స్పీడ్ గా సాగే కథనంతో చిన్న కథని పెద్దగా లాక్కొచ్చాడని టాక్ వచ్చింది. ఏది ఏమైనా 100 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టిన విశాల్ నుండి వచ్చిన రత్నం సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ ని అందుకుంది.

డిజాస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న రత్నం..

అయితే సినిమా ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ సినిమాలు బ్లాక్ బస్టర్ లు అవ్వవు. కానీ ఒక స్టార్ హీరో సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత సినిమా మాత్రం టాక్ ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మంచి జోరుని చూపిస్తుంది. టాక్ బాగుంటే సాలిడ్ లాంగ్ రన్ లేదా టాక్ బాలేక పోతే వీక్ కలెక్షన్స్ ని అందుకుంటుంది. లేటెస్ట్ గా కోలివుడ్ హీరో విశాల్ (Vishal) నటించిన కొత్త సినిమా రత్నం రీసెంట్ గా రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకోడమే కాకుండా, డిజాస్టర్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక విశాల్ నటించిన లాస్ట్ మూవీ మార్క్ ఆంటోని, భారీ రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకుని 102 కోట్ల వసూళ్లతో విశాల్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ సినిమా మొదటి రోజు నుండే సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

శిఖరం నుండి నేలపైకి..

అయితే లేటెస్ట్ గా వచ్చిన రత్నం సినిమా మార్క్ అంటోని లో 20 శాతం వసూళ్లు కూడా అందుకోలేదు. మార్క్ ఆంటోనీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని సైతం విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం వీకెండ్ లో అందుకోలేక పోయింది. రత్నం వీకెండ్ లో తమిళ్ లో 6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే, మార్క్ ఆంటోని మూవీ మొదటిరోజే 7.75 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక రత్నం వీకెండ్ కలెక్షన్స్ ని చూస్తె, మార్క్ ఆంటోని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 11.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే రత్నం మూవీ వీకెండ్ మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని రత్నం మూవీతో సొంతం చేసుకున్నాడు విశాల్. పరిస్థితి చూస్తుంటే నాలుగోరోజుకే థియేటర్ల లోంచి సినిమాను ఎత్తేసేలా ఉన్నారు బయ్యర్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు