Yamudiki Mogudu : 100 రోజుల వేడుకలో పత్తి రైతులకు చిరు సాయం.. స్నేహితులు ఇండస్ట్రీ లో ఎదగడం కోసం చేసిన చిత్రమిది!

Yamudiki Mogudu : తెలుగు చిత్ర పరిశ్రమ లో అందరివాడుగా అభిమానుల చేత పిలిపించుకునే మెగాస్టార్ చిరంజీవి గొప్పదనం గురించి అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ నుండే కాదు, సొసైటీ లో కూడా ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వ్యక్తి చిరంజీవి. చాలా వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మంచి మనసున్న హీరోలు ఉండగా, అందులో మొదటి లిస్టులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరి సపోర్టు లేకుండా నటుడుగా ఎంత ఎత్తుకు ఎదిగాడో చూసాం. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలిచారు. తనే కాకుండా తన సోదరులను, తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందరిలా చేశాడు. ఇక ఈ వయసులో కూడా తన వారసులకు పోటీగా దూసుకుపోతున్నాడు. ఇక ఈయన హీరోగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా అభిమానం సంపాదించుకున్నాడు.

ఆరోజుల్లోనే చిరంజీవి గొప్పదనం..

ఇక సినిమా ఇండస్ట్రీ లో ఎవరికీ కష్టమొచ్చినా ముందు గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఆయనకు సహాయం చేసే గుణం చాలా ఉంటుంది. ఇప్పటికే ఆయన సొంతంగా ట్రస్ట్ కూడా పెట్టి దాని ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇండస్ట్రీ లో ఎంతో మంది చలనచిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు చిరంజీవి నుండి సాయం పొందినవారే. రీసెంట్ గా తమిళ్ నటుడు పొన్నాంబళంకు అనారోగ్య సమస్యతో ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోతే, చిరంజీవి దగ్గరుండి ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిందే. అయితే గతంలో చిరంజీవి తాను నటించిన యముడికి మొగుడు సినిమా (Yamudiki Mogudu) సమయంలో ఒక గొప్ప పని చేసి అందరి ద్వారా శభాష్ అనిపించుకున్నాడు. అసలు విషయం ఏంటంటే. యముడికి మొగుడు సినిమా ఆ సమయంలో మంచి టాక్ తో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకోగా, చిత్ర యూనిట్ శత దినోత్సవ వేడుకలు ఘనంగా చేసారు. అయితే ఆ స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇక చిరంజీవి సినిమా శ‌త‌దినోత్స‌వం రోజు ఆత్మహ‌త్య‌ చేసుకున్న పత్తిరైతుల కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించారు. ఏ రాజకీయ నాయకుడు చేయని సహాయం ఆయన చేయటంతో అప్పుడే ఆయన దానగుణం ఏంటో అందరికీ అర్థమైంది.

స్నేహితులకోసమే సినిమా చేసిన చిరు..

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస చిత్రాలతో తెలుగు సినిమాని ఊపేస్తున్న సుప్రీం హీరో చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించి అభిమానులకు మరింత చేరువ చేసిన చిత్రం “యముడికి మొగుడు”. సోషియో ఫాంటసీ జోనర్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులన్నిటిని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ‘డైనమిక్ మూవీ మేకర్స్’ పతాకంపై చిరంజీవి స్నేహితులు, నటులు అయిన హ‌రిప్ర‌సాద్, ప్రసాద్ బాబు, సుధాకర్, నారాయణరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, 1988 ఏప్రిల్ 29న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటికే నటులు గా రాణిస్తున్న ఈ నలుగురు నిర్మాతలు గా సినిమా తీయాలని భావించగా, చిరంజీవి తన స్నేహితుల కోసం ఈ సినిమా చేసారు. అయితే యముడికి మొగుడు తర్వాత ఎక్కువ చిత్రాలు నిర్మించలేకపోయారు. ఇక చిరంజీవితో కలిసి ఈ నలుగురు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించడం జరిగింది.

- Advertisement -

ఇక యముడికి మొగుడు చిత్రం ఆ రోజుల్లోనే 4.75 కోట్ల షేర్ వసూలు చేయగా, యముడికి మొగుడు శత దినోత్సవాన్ని చెన్నై లో మెరీనా బీచ్ దగ్గర గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఇక ఈ సినిమాను తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘అతిశయ పిరవి’(1990) పేరుతో రీమేక్ కావడం విశేషం. చిరంజీవి కి మూడో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన యముడికి మొగుడు విడుదలై నేటికీ 36 వసంతాలు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు