Pranaya Vilasam on OTT : ప్రేమలు హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీని ఎక్కడ చూడొచ్చు అంటే?

Pranaya Vilasam on OTT : గతేడాది రిలీజ్ అయిన మరో మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రణయ విలాసం ఓటిటిలోకి రాబోతోంది. ఈ మూవీని ఈ వారంలోనే ఓటిటిలోకి తీసుకురాబోతున్నట్టు ఈటీవీ విన్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కూడా ప్రధాన పాత్ర పోషించడంతో ప్రణయ విలాసం మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ పై క్యూరియాసిటీ నెలకొంది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ తాజాగా ప్రాణయ విలాసం మూవీని వచ్చే గురువారం అంటే మే 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చాలా రోజులుగా మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఇదే సమాధానం అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. మీ డైరెక్ట్ మెసేజ్ లు, ప్రశ్నలకు ఇదే మా సమాధానం… తొలి ప్రేమనే ప్రతి ఒక్కరి మనసుల్లో చిరకాలం నిలిచిపోయే ప్రేమగా చెబుతారు. ప్రణయ విలాసం మే 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది అంటూ అఫీషియల్ గా ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

బడ్జెట్ తక్కువ.. లాభాలు ఎక్కువ..

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో అర్జున్ అశోక్ హీరోగా నటించాడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలుతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మమిత బైజు ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. గత ఏడాది ఫిబ్రవరి 24న థియేటర్లలోకి వచ్చిన ప్రణయ విలాసం మూవీ 10 రోజుల్లోనే 2.5 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రణయ విలాసం మూవీ ద్వారా తొలిప్రేమే నిజమైన ప్రేమ, అదే శాశ్వతంగా నిలిచిపోతుంది అనే సందేశాన్ని ప్రేక్షకులకు తెలియ చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ నిఖిల్ మురళి. జ్యోతిష్, సును ఏవి ఈ మూవీకి స్టోరీని అందించారు.

- Advertisement -

ప్రణయ విలాసం స్టోరీ ఏంటంటే…

మలయాళ మూవీ మేకర్స్ క్వాలిటీ కంటెంట్ తో ఇటీవల కాలంలో ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రణయ విలాసం మూవీ కూడా అలాంటి భిన్నమైన కథ అని చెప్పొచ్చు. ఇక ప్రణయ్ విలాసం స్టోరీ లోకి వెళ్తే… గోపిక, సూరజ్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. గోపిక అతనికి అన్నివేళలా తోడుండే ప్రేయసిగా కనిపిస్తుంది. ఇక సూరజ్ తల్లిదండ్రుల తొలిప్రేమ, ఆమె ఫస్ట్ లవ్ అర్థం చేసుకొని తల్లి మరణానంతరం తన చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మరో నాలుగు రోజుల్లో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా మమిత సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో తెలుగు వెర్షన్, హాట్ స్టార్ లో మిగతా వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మమిత నటించిన ఈ రెండు సినిమాలను డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు