Baak Movie : సుందర్ సి ముందు సినిమాల రిజల్ట్ ని బట్టే ఈ బిజినెస్ జరిగిందా?

Baak Movie : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు సుందర్. సి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హారర్ కం, డివోషనల్ ఫాంటసీ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి అలరిస్తుంటారు. ఆ రోజుల్లోనే అరుణాచలం లాంటి సెన్సేషనల్ చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత సుందర్ కే దక్కింది. వీటితోపాటు గ్లామర్ కమర్షియల్ మూవీలు కూడా తెరకెక్కించి హిట్లు కొడుతుంటారు. ఇదిలా ఉండగా, కోలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన సుందర్ సి ప్రముఖ నటి ఖుష్బూ భర్త అని తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అరణ్మనై 4 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అరణ్మనై సిరీస్ లో నాలుగో భాగం కాగా, హారర్ కామెడీ జోనర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ మే 3న రిలీజ్ కి అయింది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటించగా, తెలుగులో బాక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ముందు సినిమాల రిజల్ట్ ఈ సినిమాకి హెల్ప్ అవుతుందా?

ఇక సుందర్ సి సరిగ్గా పదేళ్ల కింద అరణ్మనై ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించారు. హన్సిక, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం, తెలుగులో చంద్రకళ పేరుతో రిలీజై మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత అరణ్మనై 2లో త్రిష, హన్సిక నటించగా కళావతి పేరుతో మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ఇక మూడేళ్ల క్రితం అరణ్మనై 3 తెలుగులో అంతఃపురం పేరుతో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయినా సరే సుందర్ నాలుగో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో దర్శకుడు సుందర్ మొదటి భాగాలతో మెప్పించినట్టు మరోసారి మ్యాజిక్ చేస్తాడా అనేది చూడాలి. ఇక బిజినెస్ పరంగా ఈ సినిమా డీసెంట్ గానే జరిగినట్లు తెలుస్తుంది. ఈ హర్రర్ కామెడీ మూవీ తెలుగు ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా, రొటీన్ గానే అనిపిస్తూ ఉన్నా కూడా సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయంటూ, మేకర్స్ చెబుతూ ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి థియేటర్స్ కి ఎంతవరకు వస్తారో చూడాలి. ఇక ట్రైలర్ లో తన సిస్టర్ తమన్నా, తన బావలను చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వచ్చే హీరో ఈ హత్యల వెనక ఉన్న మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో వస్తున్న బాక్ మూవీ ట్రైలర్ రొటీన్ గానే అనిపించినా కొన్ని చోట్ల విజువల్స్ ఆకట్టుకోవడం తెలుగు కమెడియన్స్ ను పెట్టడంతో కొంచం ఇక్కడ వర్కౌట్ అయ్యేలా అనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఓన్ రిలీజ్?

ఇక అరణ్మణై 4 (Baak Movie) కామెడీ కొంచెం వర్కౌట్ అయినా, మాస్ సెంటర్స్ లో మినిమమ్ వసూళ్ళని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాను తెలుగు లో ఏసియన్ థియేటర్స్ మరియు సురేష్ ప్రొడక్షన్ వారు రిలీజ్ చేస్తూ ఉండగా, వాళ్ళ థియేటర్స్ లోనే సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా రిలీజ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బిజినెస్ మీద వసూళ్ళని సొంతం చేసుకుంటే తెలుగు లో హిట్ గా చెప్పుకోవచ్చు. డీసెంట్ టాక్ కనుక వస్తే ఈ జానర్ మూవీస్ కి ఇప్పటికీ మాస్ సెంటర్స్ లో ఎంతో కొంత ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది కాబట్టి టార్గెట్ ను అందుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక తమిళ్ లో బాక్ 10 కోట్ల వరకు బిజినెస్ చేసిందని అక్కడ కూడా ఓన్ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక మేకర్స్ నాన్ థియేట్రికల్ రైట్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుందర్ సి గత సినిమాలు బాగా ఆడడంతో బాక్ ట్రైలర్ అంతగా ఇంప్రెసివ్ గా లేకపోయినా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు