Shobhan Babu : ఒకే రోజున విడుదలైన నటభూషణ శోభన్ బాబు ఐదు దశాబ్దాల క్లాసిక్స్ చిత్రాలు…

Shobhan Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం అగ్రనటుల్లో ఒకరైన “నటభూషణ శోభన్ బాబు” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కంటే కూడా అత్యధిక మహిళా ప్రేక్షకాదరణ ఉన్న హీరోగా, అందాల నటుడిగా ఆయనకు పేరుంది. ఇక శోభన్ బాబు చిత్రాలంటే టాక్ తో సంబంధం లేకుండా ఆ రోజుల్లో ఒక్కసారైనా చూసేవారు. అంతటి పేరున్న శోభన్ బాబు ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులని అలరించారు. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఓ రెండు చిత్రాలు ఇదే రోజు, ఒకేరోజున విడుదలై ఘన విజయం సాధించాయి. కానీ అవి ఒకే కాలంలో రాలేదు. రెండు వేర్వేరు కాలాల్లో వచ్చి ఘన విజయం సాధించాయి. అందులో ఒకటి శోభన్ బాబు శారద హీరో,హీరోయిన్లు గా నటించిన “పసిడి మనసులు” చిత్రం 1970 మే 16న విడుదలయింది. మరో చిత్రం శోభన్ బాబు, వాణిశ్రీ కలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ “జీవనజ్యోతి”. ఈ సినిమా 1975 మే 16న విడుదలైంది. ఈ రెండు చిత్రాలు కూడా కుటుంబ కథా చిత్రాలుగా విడుదలై ఘన విజయం సాధించాయి.

 5 decades of Shobhan Babu Super Hit movies

54 వసంతాల “పసిడి మనసులు”..

శోభన్ బాబు (Shobhan Babu) శారద హీరో,హీరోయిన్లుగా 1970 మే 16న విడుదలైన ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం గా తెరకెక్క్కగా, ఉషా ప్రొడక్షన్స్ పతాకం పై పి. చిన్నపరెడ్డి నిర్మించడం జరిగింది. ఇక పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా, గుడిమెట్ల అశ్వద్ధామ సంగీతాన్ని అందించారు. శోభన్ బాబు శారద అప్పుడప్పుడే స్టార్లు గా రానిస్తున్న సమయంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో వచ్చిన శారద, బలిపీఠం, లాంటి చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి. అప్పటి నుండి కలయికలో దాదాపు 18 సినిమాలు రావడం జరిగింది. ఇక పసిడి మనసులు చిత్రం విడుదలై నేటికి 54 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక అశ్వద్ధామ సమకూర్చిన పాటలన్ని ఆరోజులలో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

- Advertisement -

49 వసంతాల “జీవన జ్యోతి”..

నట భూషణ శోభన్ బాబు, కళాభినేత్రి వాణిశ్రీ కాంబినేషన్ లో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ చిత్రం “జీవన జ్యోతి”. వాణిశ్రీ టైటిల్ రోల్ లో నటించగా, ‘గంగ మంగ’ తర్వాత రెండో సారి ఆమె ద్విపాత్రాభినయం చేసింది. తల్లి దండ్రులకు దూరంగా పెరిగి, తెలియకుండానే వాళ్ళని అసహ్యించుకునే కూతురు, తన తల్లి దండ్రుల గురించి నిజాలు తెలుసుకుని, మతి స్థిమితం ఉన్న తల్లి కోసం కూతురు ఎలాంటి త్యాగం చేసిందనేది కథ. కథ పరంగా ఎంతో లోతైన భావాలున్న కథ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ వినడం కన్నా చూస్తే కళ్ళకు కట్టినట్టు బాగా అర్ధమవడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు ఎంతో భావోద్వేగానికి గురువవుతారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా శోభన్ బాబు, వాణిశ్రీ పోటా పోటీగా వాళ్ళ పాత్రల్లో నటనలో ఒదిగిపోయారు. ఇక వీళ్ళ నటనకు తోడు కె. విశ్వనాధ్ అద్భుత దర్శకత్వ ప్రతిభ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాకు కె.వి. మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా హిందీలో విశ్వనాధ్ మళ్ళీ “సంజోగ్” పేరుతో జితేంద్ర, జయప్రద తారాగణంగా తెరకెక్కించి అక్కడ కూడా హిట్ అందుకున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు