Gangs Of Godavari : ఈసారి పోస్ట్ పోన్ లేదు రిలీజ్ పక్కా

Gangs Of Godavari : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా అడుగు పెట్టాడు కృష్ణ చైతన్య. కొన్ని సూపర్ హిట్ పాటలకు సాహిత్యం అందించి రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా మారాడు. నారా రోహిత్ నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే కృష్ణ చైతన్యంలో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అని అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత నితిన్ హీరోగా చల్ మోహన్ రంగా అనే సినిమాను తీశాడు. ఈ సినిమా ఊహించిన విషయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత కొన్ని నీళ్లు డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు.

విశ్వక్సేన్ సక్సెస్ రేట్
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్సేన్ నేహా శెట్టి కలిసి నటిస్తున్నారు. విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన ఒకరు. వచ్చిన ప్రతి స్క్రిప్ట్ ను చేసేయకుండా నచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ కు అద్భుతమైన సినిమాలను అందిస్తూ ఉంటాడు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కూడా మంచి వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకున్నాడు. విశ్వక్సేన్ కి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఒక సినిమాను చేశాడంటే కచ్చితంగా ఆ సినిమా లో ఏదో ఉంటుంది అని నమ్మి థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఉన్నారు.

దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు
కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్. విశ్వక్సేన్ ఇప్పటివరకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను రాబట్టాయి. మంచి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు విశ్వక్. ఈ సినిమా విషయంలో ఎప్పటి వరకు మూడుసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది చిత్ర యూనిట్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక కారణం వల్ల ఆ సినిమా వెనక తగ్గటం జరుగుతూ ఉంది.

- Advertisement -
Gangs Of Godavari : This time there is no post phone, the release is sure
Gangs Of Godavari : This time there is no post phone, the release is sure

రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్
ఇక రీసెంట్ గా ఈ సినిమాను మే 31 వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మరోసారి ఈ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. రీసెంట్గా ఫహద్ ఫాజల్ నటించిన ఆవేశం అనే సినిమాలోని బాగా ఫేమస్ అయిన ఒక వీడియోను విశ్వక్సేన్ వెర్షన్ లో పోస్ట్ చేసి ఈ సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. ఇదివరకే మూడుసార్లు ఈ డేట్ మిస్సయిన విషయాన్ని కూడా ఇదే వీడియోతో మరోసారి గుర్తు చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా మే 31న థియేటర్లో విడుదల కానుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు