36Years For Yamudiki Mogudu : మెగాస్టార్ చిరంజీవిని రికార్డుల రారాజుగా నిలిపిన యముడికి మొగుడు..

36Years For Yamudiki Mogudu : టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న రికార్డులు ఎవరికీ లేవని చాలా మంది అంటుంటారు. ఇతర ఇండస్ట్రీలను పట్టించుకోక చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ వరకు ఆగాడు గాని, 80స్ లో చిరు క్రియేట్ చేసిన రికార్డులు , రజిని, కమల్ వంటివారికి కూడా లేవని చెప్పాలి. అప్పటికే ఖైదీ, పసివాడి ప్రాణం వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో తెలుగు సినిమాని ఊపేస్తున్న సుప్రీం హీరో చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించి చిరంజీవిని అభిమానులకు మరింత చేరువయ్యేలా చేసిన చిత్రం “యముడికి మొగుడు”. సోషియో ఫాంటసీ జోనర్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులన్నిటిని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి బ్రేక్ డాన్స్ లకు, స్టైలిష్ ఫైట్స్ కి, అలాగే తన స్టైల్ అఫ్ ఆటిట్యూడ్, మేనరిజానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిరంజీవి కి మూడో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన యముడికి మొగుడు విడుదలై నేటికీ 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆ రోజుల్లో యముడికి మొగుడు చిత్రం క్రియేట్ చేసిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

ఫాంటసీ జోనర్ లో యముడి నేపథ్యంలో కథ..

ధర్మాన్ని పాటించే యమధర్మరాజే పొరపాటు చేస్తే ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘యముడికి మొగుడు’. ఎన్టీ రామారావు నటించిన దేవాంతకుడు, యమగోల చిత్రాల స్ఫూర్తి తో ఈ కథ తెరకెక్కినది. ఇక యముడికి మొగుడు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, రాధ, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ‘పసివాడి ప్రాణం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, మళ్ళీ చిరు కెరీర్‌లో అంతకు మించిన ఇండస్ట్రీ హిట్‌ని అందించిన మూవీ ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్‌లో చిరు ద్విపాత్రాభినయం చేశారు. ఇక యమ ధర్మరాజు గా కైకాల సత్యనారాయణ నటించగా, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య నటించారు. అలాగే విచిత్ర గుప్తుడిగా సుత్తివేలు నటించారు. అయితే అసలు పురాణాల్లో లేని విచిత్రగుప్త పాత్ర ద్వారా యమలోకంలో కొత్త పాత్రను ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత యముడికి మొగుడు చిత్ర యూనిట్ కే దక్కింది. అలాగే.. మనిషిని పోలిన మనుషులు ఆరుగురుంటారనే నానుడిని యమధర్మరాజు చేసిన తప్పుకి సరిదిద్దుగా చేసే పరిష్కారంగా బాగా వాడుకున్నారు.

రికార్డులకు కేరాఫ్ గా యముడికి మొగుడు..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీస్ లో ‘యముడికి మొగుడు’కి (36Years For Yamudiki Mogudu) ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే.. ‘పసివాడి ప్రాణం’ (1987) లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మళ్ళీ చిరు కెరీర్‌లో అటువంటి విజ‌యాన్ని అందించింది ‘యముడికి మొగుడు’. అంతేకాదు.. చిరు తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చేసిన సోషియో – ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ కూడా ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ సినిమాల్లో అన్ని పాటలు క్లాసిక్ హిట్స్ గా నిలవగా, ఇప్పటికి ఈ చిత్ర పాటలని ప్రేక్షకులు వింటూనే మైమరిచిపోతారు. లెజెండరీ రచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు, ప్రముఖ సంగీత దర్శకులు రాజ్ – కోటి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో ‘అందం హిందోళం’, ‘వాన ఝ‌ల్లు’, పాటలైతే ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక యముడికి మొగుడు చిత్రాన్ని ‘డైనమిక్ మూవీ మేకర్స్’ పతాకంపై చిరంజీవి స్నేహితులు నటులు అయిన హ‌రిప్ర‌సాద్, సుధాకర్, నారాయణరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, 1988 ఏప్రిల్ 29న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా ‘యముడికి మొగుడు’ నేటితో 36 వసంతాలను పూర్తి చేసుకుంది.

- Advertisement -

ఇక యముడికి మొగుడు చిత్రం ఆ రోజుల్లోనే 4.75 కోట్ల షేర్ వసూలు చేయగా, ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్ తో చిరంజీవే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంతో బ్రేక్ చేసారు. ఇక యముడికి మొగుడు శత దినోత్సవాన్ని చెన్నై లో మెరీనా బీచ్ దగ్గర గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఇక ఈ సినిమాను తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘అతిశయ పిరవి’(1990) పేరుతో రీమేక్ కావడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు