Ramabanam: గోపీచంద్ ను ఓ రేంజ్ లో పొగిడిన హీరోయిన్

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ గా నటించిన చిత్రం రామబాణం. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తో చేస్తున్న గోపీచంద్ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్లయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాగా రామబాణం వస్తుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి.జి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మించారు. మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు ముఖ్యపాత్రలో నటించారు. ఇంకా ఖుష్బూ, అలీ, తరుణ్ అరోరా, నాజర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శీను ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

రామబాణం మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కుడా జరుపుకుంది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది డింపుల్ హయతి. రామబాణం మూవీ టీమ్ అందరి గురించి చెప్పిన డింపుల్, మూవీ హీరో గోపీచంద్ ని అయితే ఓ రేంజ్ లో పొగిడేసింది.

ఈ ఈవెంట్ లో హీరోకంటే ఎక్కువ సేపు మాట్లాడింది డింపుల్. గోపీచంద్ గురించి చెప్తూ ఈ సినిమాలో పంచెకట్టు లో చాలా బాగున్నారు అంది. ఒకప్పటి యజ్ఞం, రణం మూవీ లో కనిపించినంత గ్లామర్ గా ఈ సినిమాలో ఉన్నారని డింపుల్ చెప్పింది. ఇక గోపీచంద్ ఫిమేల్ లీడ్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చిన దగ్గరుండి చూసుకునేవారు అని చెప్పింది. అందుకే మీరు జెంటిల్ మ్యాన్ అయ్యారు అని డింపుల్ చెప్పింది. ఇక ఒక నటుడు షూటింగ్ లో ఎలా ఉండాలి అని గోపీచంద్ దగ్గరే నేర్చుకున్నానని డింపుల్ చెప్పింది. ఇక రామబాణం చిత్రం మే 5 న విడుదల అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు