Bhola shankar : కీర్తి సురేష్ కొత్త సినిమా

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ మీద ఉన్న కీర్తి సురేష్ మళ్ళీ సినిమాల జోరు పెంచేసింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న “భోళా శంకర్ ” సినిమాలో నటిస్తున్న ఈమె తాజాగా మరో సినిమా అప్డేట్ ఇచ్చింది.

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కీర్తి సురేష్. అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించుకుంది. పేరుకి తమిళ్ అమ్మాయే అయిన చక్కగా తెలుగు నేర్చుకొని ఆమె నటించే సినిమాలకి ఆమెనే డబ్బింగ్ చేసుకొని తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. దాదాపు తెలుగులో ఉన్న టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేసింది కీర్తి. ఇటీవలనే నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో నటించి వెన్నెల పాత్రలో అందరిని మెప్పించింది. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి కీర్తి సురేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ్ లో రివాల్వర్ రిట అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లిట్ చేసుకుంది, ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొందరలోనే విడుదలకి సిద్దమవుతుంది. ఇదిలా ఉండగానే ఉదయనిధి స్టాలిన్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తోన్న “మామన్నన్ ” సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమాని సంబందించిన ఫస్ట్ లుక్ ని ఆదివారం రిలీజ్ చేసారు. ఫహద్ ఫాజిల్, వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇలా ఒక పక్క గ్లామర్ హీరోయిన్ గా నటిస్తూ మరోపక్క ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ్ భాషల్లో బిజీ, బిజీ ఉంటోంది కీర్తి సురేష్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు