Maamannan: తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఫోజులిస్తున్న కీర్తి

కీర్తి సురేష్ ఫుల్ జోష్ మీదుంది. ఈ సంవత్సరం తెలుగులో దసరా తో సూపర్ హిట్ కొట్టిన కీర్తి, తాజాగా తమిళ్ లో మామన్నన్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఆ సినిమా తమిళ్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకొని లాంగ్ రన్ లో ఆడుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వరుస సినిమా సక్సెస్ తో కీర్తి సురేష్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి.

కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, హలో సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్. చెన్నై లో వీరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఇటు కళ్యాణి కూడా చాలా ఫంక్షన్ లలో తన ఫ్రెండ్ తో కలిసి తిరగడం చూసే ఉంటారు.

ఇకపోతే అటు కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో సినిమాలు చేయకపోయినా, మలయాళం లో వరుస చిత్రాలు చేస్తూ బిజీ గా ఉంది. ఇక తాజాగా వీళ్లిద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నిర్వహిస్తున్న మ్యూజిక్ టూర్ లో భాగంగా పాల్గొంటూ అక్కడి తమ ఫోటో ని షేర్ చేసారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం మామన్నన్ సినిమా ప్రమోషన్లతో బిజీ గా ఉన్న కీర్తి ఆ హడావిడి అయిపోయాక, మరో తమిళ్ సినిమా షూటింగ్ తో బిజీ అవనుంది. ఇక జులై మూడవ వారం నుండి తెలుగులో నటించిన భోళా శంకర్ చిత్ర ప్రమోషన్ లో పాల్గొననుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు