Bhaagsaale: ఈ సినిమాలో రాజీవ్ బతికేఉంటాడట.. కాలభైరవ ప్రామిస్

టాలీవుడ్ లో విలక్షణ నటుడైన రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథ డిమాండ్ చేస్తే పాత్ర చిన్నదైనా, పెద్దదైనా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అన్ని రకాల పాత్రలు చేసే నటుడాయన. సరిగ్గా డైరెక్టర్లు వాడుకుంటే ప్రకాష్ రాజ్ రేంజ్ పెర్ఫర్మన్స్ చేసే సత్తా ఉన్న నటుడు. ప్రస్తుతం రాజీవ్ కి ముందు కన్నా బాగానే పాత్రలు వస్తున్నాయని చెప్పొచ్చు.

అయితే రాజీవ్ పది సినిమాల్లో నటిస్తే అందులో ఏడెనిమిది సినిమాల్లో చనిపోయే పాత్రలు ఉంటాయని అందరికి తెలిసిందే. ఇది ఆడియన్స్ కి కూడా చాలా కామన్ అయిపోయి, ఏ సినిమాలోనైనా రాజీవ్ కనబడగానే ఆ సినిమాలో రాజీవ్ చనిపోతాడని చెప్పేస్తున్నారు. మంచి పాత్ర అయితే విలన్ చేతిలో, చెడ్డ పాత్ర అయితే హీరో చేతిలో చస్తాడు అనేవారు. అయితే రీసెంట్ గా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాలభైరవ రాజీవ్ నటించిన లేటెస్ట్ సినిమా గురించి ప్రస్తావించాడు.

శ్రీ సింహ హీరోగా నటించిన “భాగ్ సాలే” జులై 7న విడుదల అవుతుందని తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో భాగ్ సాలే సినిమాలో నటించిన రాజీవ్ మాట్లాడుతూ, సుమ గురించి ప్రస్తావిస్తుంటే, మధ్యలో ఒక సందర్భంలో కాలభైరవ మాట్లాడుతూ తమ సినిమాలో రాజీవ్ చనిపోడని ప్రామిస్ చేసాడు.ఇది ఈవెంట్ లో విన్న అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అటు సుమ కాలభైరవకి థ్యాంక్స్ చెప్తూ నీ ప్లానింగే కదా ఇదంతా అని అంది.

- Advertisement -

అటు రాజీవ్ కనకాల కూడా రీసెంట్ గా విడుదలైన విరూపాక్ష సినిమాలో బతికేఉంటానని అంటూ ఆ ఈవెంట్ కి వచ్చిన వారికి చెప్పాడు. మొత్తానికి భాగ్ సాలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ స్పీచ్ ల కంటే ఈ ఫన్నీ మూమెంటే హైలెట్ అయ్యిందని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు