Jolly LLB 3 : అక్షయ్ కుమార్ సినిమాపై కేసు.. వృత్తినే అవమానపరిచారని?

Jolly LLB 3 : బాలీవుడ్ లో వివిధ రకాల ఫ్రాంచైజ్ లలో పలు సినిమాలు వస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. హౌస్ ఫుల్ అని, రేస్ అని, సింగం సిరీస్ అని, యాక్షన్ జోనర్స్ లో, కామెడీ జోనర్స్ లో వివిధ రకాల సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాగే అలాంటి చిత్రాల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే అర్షద్ వర్షి హీరోలుగా నటించిన “జాలీ ఎల్ ఎల్ బి” సిరీస్ కూడా ఒకటి. అయితే 2013 లో మొదలైన ఈ సినిమా ఈ ఫ్రాంచైజ్ ఇపుడు మూడో చిత్రానికి చేరుకుంది. జాలీ ఎల్ ఎల్ బి ఫస్ట్ పార్ట్ లో అర్షద్ వర్షి హీరోగా నటించగా, రెండో పార్ట్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. కామెడీ మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో భాగం కూడా రాబోతుంది. మూడో భాగంలో కూడా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఇక వరుస ప్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఈ సీక్వెల్ కి రెడీ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జాలి ఎల్ఎల్ బి పార్ట్ 3 షూటింగ్ కూడా మొదలవడం జరిగింది. రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై ఓ కేసు నమోదయింది. అది కూడా ఈ సినిమా న్యాయ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఆ న్యాయ వ్యవస్థ కి సంబంధించిన ప్రముఖులే కేసు వేయడం గమనార్హం.

జాలి సీక్వెల్ మేకర్స్ పై కేసు..

ఇక అసలు విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ హీరోగా జాలి ఎల్ఎల్ బి మూడో సీక్వెల్ తెరకెక్కుతుండగా, చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై న్యాయ వ్యవస్థ వైపు నుంచి పని చేస్తున్న ఓ ప్రముఖులే కేసు వేసి షాకిచ్చారు. ఆ కేసు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే 2013, 2017 లో వచ్చిన రెండు సినిమాలని జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ‘చంద్రభాన్’ చూసారు. సినిమాలు చూసిన తర్వాత వెంటనే పార్ట్ 3 షూట్ ని నిలిపివేయాలని కేసు వేసారట. అయితే తాను చూసిన ఈ రెండు సినిమాల్లో కూడా, న్యాయ వ్యవస్థ పట్ల నటీనటులకు కానీ మేకర్స్ కి కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా అనిపించింది అని, అలాగే న్యాయ వ్యవస్థతో పాటుగా తీర్పు చెప్పే న్యాయమూర్తి అన్నా కూడా ఎలాంటి గౌరవం వారికి లేదు అన్నట్టు అనిపించింది అని వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలలో కొన్ని సీన్లలో న్యాయ వాద వృత్తిని అవమానించేటట్టు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక మీదట అలాంటి సినిమాలు రాకూడదని ఈ సీక్వెల్ పై కేసు వేసామన్నారు.

గెలిచేదెవరు?

అయితే న్యాయవాది చంద్రభాన్ వేసిన కేసు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనమైంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా, ఈ కేసు విషయంలో ఇరుక్కుంది. మరి చూడాలి చివరికి ఎవరు గెలుస్తారు అనేది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక అక్షయ్ కుమార్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇవే కాక బాలీవుడ్ లో పద్మావత్, మణికర్ణిక లాంటి సినిమాలపై కూడా అప్పట్లో కేసులు సంచలనం అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు