Jailer: సూపర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లిమ్ప్స్.. పెద్ద ప్లానింగే

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “జైలర్”. డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 లో వచ్చిన పెద్దన్న సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని రజినీకాంత్ ఈ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న జైలర్ లో భారీ తారాగణం నటిస్తున్నారు. ఒక్క తమిళమే కాకుండా వేరే ఇండస్ట్రీల్లో పేరున్న స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.

జైలర్ లో ప్రత్యేక పాత్రల్లో మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, హిందీ నుంచి జాకీ ష్రాఫ్, తెలుగు నుంచి సునీల్, నాగబాబు నటిస్తున్నారు. ఇంకా వీళ్ళే కాక రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, వినాయకన్, సాధు కోకిల, కిషోర్, నమో నారాయణ, కాలకేయ ప్రభాకర్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా రజిని కెరీర్ లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. 2019 లో వచ్చిన పేట తర్వాత రజినీకాంత్ కి సరైన విజయం రాలేదు. అందుకే ఈ సినిమాపై బాగా ఫోకస్ పెట్టాడు. జైలర్ సినిమాతో ఎలాగైన భారీ హిట్ కొట్టి పోటీ ఇస్తున్న ఇతర యంగ్ స్టార్స్ కి చెక్ పెట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ని చిన్న వీడియో గ్లిమ్ప్స్ తో మే4 న విడుదల చేసారు. వీడియో చిన్నదే అయినా మూవీ క్యాస్ట్ మొత్తాన్ని చిన్న చిన్న షాట్స్ లో చూపించారు. గ్లింప్స్ చివర్లో రజిని కార్ లోంచి దిగే సీన్ హైలెట్ గా ఉంటుంది. ఇక ఈ వీడియో తో జైలర్ సినిమా 2023 ఆగస్ట్ 10న రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇక ఆ టైమ్ లో తెలుగులో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ కూడా ఆగస్ట్ 11 న విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆగస్ట్ లో ఈ పోరు రసవత్తరంగా మారనుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు