Dear: జి.వీ.ప్రకాష్ కు తలనొప్పిగా మారిన ఐశ్వర్య?

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు అయిన జివీ. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “డియర్”. అటు ఇతర సినిమాలకు మ్యూజిక్ అందిస్తూనే తాను సినిమాల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు ప్రకాష్. ఎక్కువగా లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో నితిన్ నటిస్తున్న కొత్త సినిమాకి కూడా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా “డియర్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్టు మే4 న చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడం ద్వారా తెలిసింది. ఈ సినిమాను “నట్ మెగ్” ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో చిన్న మోషన్ పోస్టర్ ద్వారా చెప్పారు. తెలుగులో రానా దగ్గుపాటి ఈ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న జివి ప్రకాష్ పాత్ర పేరు అర్జున్. ఈ అర్జున్ కి తలనొప్పిగా మారింది ఎవరు అన్న కాప్షన్ తో మోషన్ పోస్ట్ తో రివీల్ చేసారు. ఆ వ్యక్తి పేరు దీపికా అని ఆమె అర్జున్ వైఫ్ అని ఈ మోషన్ పోస్టర్ ద్వారా చెప్పారు. ఆ దీపికా పాత్రలో హీరోయిన్ గా నటిస్తుంది ఐశ్వర్య రాజేష్ అని ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా చెప్పడం జరిగింది.

ఇక “డియర్” లో జివి. ప్రకాష్ హీరోగా నటించడమే కాకుండా అతనే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఐశ్వర్యా రాజేష్ తెలుగమ్మాయి అయినా ఇక్కడ అవకాశాలు రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. డియర్ మూవీని ఆనంద్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. లవ్& కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా 2023 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు