Ramabanam: మూవీ రిలీజ్ ఉత్సాహంలో స్కై డైవింగ్ చేసిన హీరోయిన్

డింపుల్ హయతి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ ద్వారా పాపులర్ అయిన ఈ తెలుగమ్మాయి రవితేజ ఖిలాడీ చిత్రం తో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా నిరాశపరచడంతో డీలాపడ్డ ఈ బ్యూటీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు రామబాణం చిత్రంతో ముందుకు వస్తుంది. రామబాణం మూవీ గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్లయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా గా రామబాణం వస్తుంది.

రామబాణం మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి.జి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మించారు. మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు ముఖ్యపాత్రలో నటించారు. ఖుష్బూ, అలీ, తరుణ్ అరోరా, నాజర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శీను ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా మే5 న విడుదలవుతున్న సందర్బంగా హీరోయిన్ డింపుల్ హయతి ఉత్సాహంగా స్కై డైవింగ్ చేసింది. దుబాయ్ లో ఈ అడ్వెన్చర్ చేసిన డింపుల్ హయతి మూవీ రిలీజ్ సందర్బంగా ఈ విధంగా స్కై డైవ్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ మూవీలో కలకత్తాకి చెందిన ఒక ఫేమస్ యూట్యూబర్ గా నటించింది. ఇప్పటికే ప్రమోషన్లతో సినిమా పై ఉన్న అంచనాలని బాగా పెంచేశారు. ఇక రామబాణం చిత్రం తో మంచి హిట్ కొట్టి మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు