SK21: లోకనాయకుడి నిర్మాణంలో శివ కార్తికేయన్ మూవీ లాంచ్

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఈరోజు అనగా మే5న గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా తర్వాత అయలాన్, మావీరన్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా శివ కార్తికేయన్ 21వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీని “రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్” బ్యానర్ లో స్వయంగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా ఇప్పటివరకు చాలా సినిమాలు నిర్మించినా ఎక్కువగా తాను హీరోగా నటించిన సినిమాలే అందులో ఉన్నాయి. రీసెంట్ గా విక్రమ్ సినిమా తో యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. తమిళంలో గార్గి, తెలుగులో విరాట పర్వం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాలో మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్ర ఓపెనింగ్ చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఓపెనింగ్ కు లోకనాయకుడు చిత్ర నిర్మాత కమల్ హాసన్, హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్, ఇంకా చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ తదితరులు విచ్చేసారు. ఈ సినిమా 2024 లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు