Devil: బింబిసార2 ఇప్పట్లో లేనట్లేనా..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో గతేడాది వచ్చిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ రానుందని గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ఈ సినిమా అసలు ఉంటుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. పార్ట్2 కి డైరెక్టర్ వశిష్ట కాదని కొత్త డైరెక్టర్ కోసం కళ్యాణ్ రామ్ వెతుకుతున్నాడని సమాచారం అందుతోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా ఒక కొలిక్కి రాలేదని, ఇప్పటిదాకా డెవలప్ చేసిన స్క్రిప్ట్ పట్ల హీరో కళ్యాణ్ రామ్ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది.

స్క్రిప్ట్ వర్క్ పట్ల కళ్యాణ్ రామ్ శాటిస్ఫై కాలేదు కాబట్టే జులై 5న ప్లాన్ చేసిన సినిమా అనౌన్సమెంట్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఇంకా డైరెక్టర్ కూడా ఫైనలైజ్ కాలేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అన్నీ సవ్యంగా సాగితే డెవిల్ రిలీజ్ తర్వాత అయినా బింబిసార 2 సినిమా పారరంభం అయ్యే ఛాన్స్ ఉంది.

బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న అమిగోస్ సినిమా నిరాశ పరిచిన క్రమంలో డెవిల్ సినిమా సక్సెస్ అవ్వటం కీలకంగా మారింది. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించటంతో బింబిసార సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్న క్రమంలో కళ్యాణ్ రామ్ కి మరొక బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు