PowerStar: ‘ఓజి’ కూడా వాయిదా పడుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాలు అన్నిటిలోకి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి సుజిత్ రిలీజ్ చేసిన ఫైర్ స్టార్మ్ గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, మిగిలిన పార్ట్ ని జులై సెకండ్ వీక్ లో కంప్లీట్ చేయాలనీ ప్లాన్ చేశారు.

అయితే, ప్రస్తుతం పవన్ వారాహి రెండో విడత యాత్రలో పాల్గొనేందుకు సిద్దమవుతూ ఉండగా, జులై సెకండ్ వీక్ లో షూటింగ్ లో పాల్గొనటం కష్టం అనే చెప్పాలి. పైగా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండచ్చు అనే సంకేతాలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇక మీదట పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించే అవకాశం ఉన్నందున ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలు మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.

ఓజిలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఈ గ్యాప్ లో మిగతా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి వారాహి యాత్ర గ్యాప్ లో కనుక పవన్ కి సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేస్తే అనుకున్న సమయానికి ఓజి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి, మును ముందు రాజకీయాల్లో బిజీ అవనున్న పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకి సమయం కేటాయించి పూర్తి చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేక వాయిదా పడుతుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు