Janhvi Kapoor Kollywood Entry : కాంట్రవర్సీ హీరోతో రొమాన్స్ కు జాన్వి గ్రీన్ సిగ్నల్?

Janhvi Kapoor Kollywood Entry : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవయినట్టుగా సమాచారం. అయితే ఆమె ఫస్ట్ తమిళ మూవీని ఓ కాంట్రవర్సీ హీరోతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే..

శింబుతో సినిమా..

సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మాదిరిగానే హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు దక్షిణాదిన తమ ఉనికిని చాటుకుంటున్నారు. అందులో జాన్వి కపూర్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే దేవరతో పాటు రామ్ చరణ్ సినిమాలను లైన్ లో పెట్టిన జాన్వి నెక్స్ట్ శింబుతో సినిమాకు కమిట్ అయినట్టు టాక్ నడుస్తోంది.

STR 48లో శింబు ద్విపాత్రాభినయం

ప్రస్తుతం థగ్ లైఫ్ లో నటిస్తున్న శింబు తర్వాత దేశింగ్ పెరియసామి చిత్రంలో నటించనున్నారు. కమల్ హాసన్ రాజ్ కమల్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘STR 48’ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని, 90% పనులు పూర్తయ్యాయని అంటున్నారు. STR 48లో హీరోగా, విలన్‌గా 2 విభిన్నమైన పాత్రల్లో శింబు నటించబోతున్నాడని కూడా చెబుతున్నారు.

- Advertisement -

Janhvi Kapoor - Black Hat

జాన్వి వర్సెస్ కియారా

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఇద్దరు బాలీవుడ్ నటీమణులతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. శ్రీదేవి కూతురు, ప్రముఖ నటి జాన్వీ కపూర్, కియారా అద్వానీ బాలీవుడ్ నటీమణులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్, కియారా అద్వానీ ఇప్పటిదాకా తమిళ సినిమాలో నటించలేదు. కాబట్టి వారు ‘STR 48’లో నటిస్తే అది వీరిద్దరికీ నటీమణుల కోలీవుడ్ అరంగేట్రం అవుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వినే మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరపగా, జాన్వి ఇంప్రెస్ అయ్యిందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. అయితే ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇంతమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి..

మొదట్లో ‘STR 48’లో నటించబోయే హీరోయిన్ అంటూ చాలామంది నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొణె ఈ మూవీలో నటిస్తారని రుమార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం జాన్వీ కపూర్ కన్ఫామ్ అయినట్టు టాక్. జూన్ చివరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

థగ్ లైఫ్ లో శింబు..

ఇదిలావుండగా శింబు ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆయన లుక్ బయటకు రాగా, మంచి స్పందన వచ్చింది. అలాగే ఓ పిక్ కూడా లీకైన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు