Chaitanya Krishna on Jr NTR : నందమూరి ఫ్యామిలీ వార్ – అగ్గి రాజేస్తున్న చైతన్య కృష్ణ… తారక్‌ను టార్గెట్ చేస్తూ మరో పోస్ట్..!

Chaitanya Krishna on Jr NTR.. నందమూరి చైతన్య కృష్ణ బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హెచ్చరించడం ఇప్పుడు వివాదానికి తెరలేపింది. సాధారణంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాంటి విషయాలలో సోషల్ మీడియాలో చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు.. అందుకే నందమూరి ఫ్యామిలీ మెంబర్ అయిన నందమూరి చైతన్యని కూడా ఇప్పుడు వారు వదలడం లేదు… ఎన్టీఆర్ జోలికి వస్తే ఎవరైనా సరే మాకు ఓకే అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నందమూరి చైతన్య కృష్ణ ఇటీవలే బ్రీత్ సినిమాతో మళ్లీ థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు..

జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చైతన్య కృష్ణ వార్నింగ్..

Chaitanya Krishna on Jr NTR : Nandamuri Family War - Chaitanya Krishna inflaming the fire...Another post targeting Tarak..!
Chaitanya Krishna on Jr NTR : Nandamuri Family War – Chaitanya Krishna inflaming the fire…Another post targeting Tarak..!

చైతన్య కృష్ణ పై సామాజిక మాధ్యమాలలో భారీగా ట్రోలింగ్ జరిగిన విషయం కూడా తెలిసిందే.. అలా ట్రోల్ అయినప్పుడు పెద్దగా రియాక్ట్ అవలేదు.. కానీ తాజాగా చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా. జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు.. ఈ మేరకు తన ఫేస్బుక్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు చైతన్య కృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదే నా హెచ్చరిక.. వైసిపికి అందులో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేనికి ఇదే నా హెచ్చరిక.. వైసిపికి అందులో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. ముఖ్యంగా ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఒకటే.. మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు.. అయినా మీరు ఎవరు మా బొ* కూడా పీ*లేరు.. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మామయ్యని , బాలకృష్ణ బాబాయిలను టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసిపి టీం కలిసి నన్ను ట్రోల్ చేశారు.. ఇక జాగ్రత్తగా ఉండండి.. అంటూ చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చిన విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..!

ఇకపోతే తాజాగా ఈ పోస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు .. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేస్తూ చైతన్య కృష్ణ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ని ఇందులోకి లాగాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.. ఎలక్షన్స్ అయిపోయాక ఈ పోస్ట్ పెట్టడం ఏంటి? ఎన్నికల ముందు పెట్టి ఉంటే అసలు ఎన్టీఆర్ పవర్ ఏంటో? మీకు తెలిసేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచీ రియాక్షన్ రావడంతో చైతన్య కృష్ణ మరొకసారి రెస్పాండ్ అయ్యారు.. సోషల్ మీడియాలో కొత్త పేజీలు క్రియేట్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిడుతున్నారు.. వాట్సాప్, ఫేస్బుక్ లకు అదే పనిగా సందేశాలు పంపిస్తున్నారు. ఈ మేరకు నన్ను దూషించిన ఖాతాలకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఈ పోస్ట్ కి జత చేస్తున్నాను.. బట్ ఐ డోంట్ కేర్ నేను చెప్పాలనుకున్న మాటను సూటిగా చెప్పేస్తాను అంటూ కూడా చైతన్య కృష్ణ కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు