Hema in Bagnalore Rave Party : హేమపై మరో కేసు… పేరు కృష్ణవేణి అంటూ పోలీసులనే బురిడీ కొట్టించిందట.

Hema in Bagnalore Rave Party : నటి హేమ మెడ చుట్టు కేసులు చాలా గట్టిగా చుట్టుకుంటున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో హేమను అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసులో తన పేరు ఉండకుండా చేయడానికి హేమ చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అనవసరమైన కేసులు ఇప్పుడు అమె మెడకు చుట్టుకున్నట్టు సమాచారం.

వీడియో రిలీజ్ నుంచి స్టార్ట్…

బెంగళూరు రేవ్ పార్టీ అంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ వినిపించిన పేరు నటి హేమ. తర్వాత హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు వచ్చినా, అవి ఫేక్ అని తెలిపోయింది. హేమ కూడా ఈ కేసులో పడకుండా, తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదు అన్నట్టు క్రియేట్ చేయ్యడానికి చాలా ట్రై చేసింది. అందులో భాగంగానే వీడియో రిలీజ్ చేసింది.

అరెస్ట్ అయ్యాకా.. ఇంటికి ఫోన్ చేయ్యాలని పోలీసుల నుంచి తన ఫోన్ తీసుకుని, తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు, ఈ కేసుతో తనకు సంబంధం లేదు అన్నట్టు ఓ వీడియో క్రియేట్ చేసి మీడియాకు వదిలింది. ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే బెంగళూర్ పోలీసులు రియాక్ట్ అయి… బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో హేమ ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో, హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఒకే డ్రేస్ ఉండటంతో హేమ భాగోతం మొత్తం బయట పడింది. దీనిపై బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. పోలీసులను తప్పుదేవ పట్టిస్తుందని రేవ్ పార్టీ కేసు కాకుండా మరో కేసు నమోదు చేశారట.

- Advertisement -
Hema in Bagnalore Rave Party
Hema in Bagnalore Rave Party

డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్…

రేవ్ పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేయించారు పోలీసులు. దీనిలో హేమకు పాజిటివ్ వచ్చింది. ఈ న్యూస్ మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. దీంతో మరో కేసు నమోదు కానుంది. నిజానికి ఇదే స్ట్రాంగ్ కేసుగా మారనుంది.

పోలీసులకు తప్పుడు సమాచారం…

బెంగళూరు రేవ్ పార్టీపైన పోలీసులు రైడ్ చేసిన టైంలో వారికి హేమ తప్పుడు సమాచారం ఇచ్చిందట. తన పేరును కృష్ణవేణిగా పోలీసులకు చెప్పిందట. దీంతో బెంగళూరు పోలీసులు రికార్డ్ ల్లో హేమ పేరును కృష్ణవేణిగా నమోదు చేసుకున్నారట. కానీ, ఈ విషయం తీవ్రత పెరగడం, వీడియో రిలీజ్ చేయడం, తెలుగు మీడియాలో హేమపైన ప్రత్యక కథనాలు రావడంతో అసలు పేరు కృష్ణవేణి కాదు, హేమ అని పోలీసులు గుర్తించారట. దీంతో హేమపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారట. పోలీసు అధికారులన తప్పుదొవ పట్టించిందని మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇలా హేమపై ఒక దాని తర్వాత ఒక ఆరోపణ రావడం అవి నిజం కావడంతో హేమపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు