Gangs of Godavari: ప్లాన్ చెయ్యకుండానే అలా సెట్టయ్యిందా

Gangs of Godavari: వెళ్ళిపోమాకే అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాకు మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఈ సినిమాలో వివేక్ అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తనలో ఉన్న మరో టాలెంట్ ని కూడా బయటికి తీసి డైరెక్షన్ చేశాడు విశ్వక్. ఆ సినిమా ఫలక్నామా దాస్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడితో విశ్వక్ లో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. 5 ఇయర్స్ క్రితం ఫలక్నామా దాస్ మే 31న రిలీజ్ అయింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో

ఇప్పుడు విశ్వక్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్ అఫ్ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు. సాహిత్య రచయితగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య. కొన్ని సినిమాలుకు అద్భుతమైన పాటలు రాసిన తర్వాత రౌడీ ఫెలో అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పుడే కృష్ణ చైతన్యలో ఇంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడు అని ప్రూవ్ అయింది. ఈ సినిమాలోని డైలాగ్స్ ఆ క్యారెక్టర్స్ ను అన్ని బాగా డిజైన్ చేసుకున్నాడు. ఈ సినిమాతో హిట్ అందుకున్న కృష్ణ చైతన్య మళ్లీ నితిన్ ఛల్ మోహనరంగా అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు.

Gangs Of Godavari

- Advertisement -

ప్లాన్ చెయ్యకుండానే అలా సెట్టయ్యిందా

డైరెక్షన్ కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మే 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే యాదృచ్ఛికంగా విశ్వక్సేను దర్శకత్వం వహించిన ఫలక్నామదాసు సినిమా కూడా ఇదే రోజున రిలీజ్ అయింది. అందుకనే విశ్వక్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ఒకటి అనుకుంటాం కానీ దేవుడు ఒక ప్లాన్ చేస్తాడు. ఐదేళ్ల క్రితం ఫలక్నామా దాస్ సినిమా వచ్చిన రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అప్పటిలానే ఒక లాంగ్ జంప్ ఒకటి కొట్టబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా లోని డ్రీమ్ రోల్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. ఈ రిలీజ్ ప్లాన్ చెయ్యకుండానే అలా సెట్టయ్యిందా అని కొంతమంది అనుమానం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు