Punarnavi : పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?

 

Punarnavi : టాలీవుడ్‌ బ్యూటీ పునర్నవి గురించే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చాలామందికి పునర్నవి సుపరిచితమే. పునర్నవి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా పునర్నవి బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలోకి వచ్చిన తర్వాత పునర్నవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్బాస్ బ్యూటీగా పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఓ వెలుగు వెలిగింది.

బిగ్ బాస్ ఇంట్లో రాహుల్ తో కలిసి పునర్నవి చేసిన హంగామా అంతా ఇంకా కాదు. ఇప్పటికీ వారిద్దరూ కలిసి చేసిన రీల్స్, డైలాగ్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పునర్నవికి బిగ్ బాస్ ద్వారా ఎంత క్రేజ్ వచ్చిందో…. రాహుల్ ద్వారా అంతకన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది. వీరిద్దరి జోడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని పునర్నవి కొట్టి పారేసింది. అయినా రాహుల్ తో వచ్చిన క్రేజ్ ను పునర్నవి ఎప్పుడూ వాడుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు.

- Advertisement -

ఇది ఇలా ఉండగా…. పునర్నవి తాజాగా తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసి స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పింది. అమెరికాలోని హవాసుపై ఇండియన్ రిజర్వేషన్ అనే విజిటింగ్ ప్లేస్ వద్ద కొండల్లో ఓ అబ్బాయితో కలిసి దిగిన ఫోటోని పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది పునర్నవి.

Actress Punarnavi Bhupalam post goes viral

ఆ ఫోటోలో ఆ అబ్బాయి ఎవరో కనిపించకుండా వారు వెనక్కి తిరిగి కూర్చొని ఉన్న ఫోటోని పోస్ట్ చేయడంతో వారి ముఖాలు కనిపించట్లేదు. ముఖ్యంగా ఆ అబ్బాయి పునర్నవీని చాలా దగ్గరికి హత్తుకుని కూర్చోగా…. పునర్నవి ఆ అబ్బాయిపై చేయి వేసుకొని కూర్చుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోను చూసిన చాలా మంది పునర్నవి బాయ్ ఫ్రెండ్ అతడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పునర్నవి ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు