Bro: ఆగస్టులో మెగా ఫ్యాన్స్ కి పండగే..!

ప్రస్తుతం మెగా హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్లో నటించిన భోళాశంకర్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే పనిలో పడ్డాడు. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పవన్ తో కలిసి నటించిన బ్రో సినిమాతో సిద్ధమవుతున్నాడు, మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాతో వస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా మెగాహీరోలంతా ఒకే నెలలో తమ  సినిమాలను రిలీజ్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లు కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై28న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రీమేక్ సినిమా అయినప్పటికీ గ్లిమ్ప్స్, టీజర్లో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైల్ లో కనిపించటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత మెగాస్టార్ భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవుతుండగా రీమేక్ సినిమా కావటం, పైగా ఫామ్ లో లేని మెహర్ రమేష్ డైరెక్టర్ కావటంతో ఈ సినిమాఫై మెగా ఫ్యాన్స్ సైతం పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో భోళాశంకర్ కి ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ అంశం చిరంజీవి అనే చెప్పాలి. ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్న మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాతో ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

గత చిత్రం గని ద్వారా డిజాస్టర్ చవిచూసిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25న వస్తున్నాడు. ఇలా ఎప్పుడూ లేని విధంగా మెగా హీరోలంతా ఒకే నెలలో థియేటర్లలో సందడి చేయనుండటంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు, ఆ తర్వాత విరూపాక్ష సినిమా సాయిధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అవ్వబొయే సినిమాలు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్స్ పరంపరను కొనసాగిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు