Samantha: పిచ్చెక్కిపోయే ఫొటోస్ వదిలిన సమంత

Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేస్తున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సమంత రుత్ ప్రభు ఒకరు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ అదే స్పీడ్‌తో దూసుకుపోతోంది. సినిమాల సంఖ్యను తగ్గించి సెలెక్టివ్‌గా చేస్తున్నా సరే సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో ఇప్పటికీ అదే హవాను చూపిస్తోంది సమంత. వివిధ భాషల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది ఈ క్యూట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన సినీ విషయాలనే కాకుండా వ్యక్తిగత వ్యవహారాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫొటోలు, వీడియోలను సైతం ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. లేటెస్ట్‌గా సమంత షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజన్లకు మజాను పంచుతున్నాయి. టాప్ మొత్తం ఫుల్ ఎక్స్‌పోజ్ చేస్తూ, సీక్రెట్ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కండలు తిరిగిన భుజాలతో ఉన్న సమంత.. మరిన్ని ట్రైసెప్స్ డిప్స్ రాబోతున్నాయంటూ హింట్ ఇచ్చింది.

- Advertisement -

సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు. సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించే సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా ఏళ్ల నుంచి హాట్ షో చేస్తూనే ఉంది. దీని వల్ల సమంత పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇక సమంత కెరీర్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తోంది. దీనికి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఆమె నటించిన వెబ్‌సిరీస్ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు