Adipurush : ఆకాశాన్నంటిన అంచనాలతో వచ్చి.. విమర్శల పాలైన కళా ఖండానికి ఏడాది పూర్తి… కలెక్షన్లు ఎంతో తెలుసా?

Adipurush : ఆది పురుష్.. సరిగ్గా ఏడాది కిందట ఎన్నో భారీ అంచనాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వచ్చి ప్రభాస్ అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన చిత్రం. అన్నిటికి మించి భారతీయ ఆధ్యాత్మికాన్ని అవమానించి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ పరువు పోగొట్టిన చిత్రమిది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం గురించి తెలుగు వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలీదని చెప్పాలి. ఎందుకంటే ఈ కళాఖండం గుర్తుపెట్టుకోలేని పీడకల. అది ప్రభాస్ అభిమానులకే కాదు రామాయణాన్ని ఆరాధించే అందరికి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకు ప్రస్తావనా అంటారా? ఈ కళాఖండం వచ్చి సరిగ్గా నేటికీ ఏడాది పూర్తయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” చిత్రం గత ఏడాది అనగా 2023 జూన్ 16న ఎన్నో భారీ అంచనాలతో, ఇంకా చెప్పాలంటే ఆకాశాన్నంటిన హైప్ తో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రకాల వివాదాలకు కూడా కారణమయ్యింది. ఈ సినిమా థియేటర్లలోంచి వెళ్లిపోయే వరకూ సమస్యలు వెంటాడాయి.

1 Year For Prabhas Adipurush Movie

కొత్తరకంగా రామాయణాన్ని చెప్పాలనుకుని.. చేతులు కాల్చుకున్నారు..adipurush review,

ఇక అది పురుష్ (Adipurush) సినిమాతో నేటి తరానికి తగ్గట్టు అల్ట్రా మోడ్రన్ లాగా చూపిద్దామని దర్శకుడు ఓం రౌత్ అనుకున్నాడు. అందుకే ఇంత మంచి కథ అయినా ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. సినిమాలో ముఖ్యంగా నటీ,నటుల పాత్రల గెటప్ లను, ఆ పాత్ర స్వభావాలను కొత్తగా చూపిద్దామనుకుని వింతగా చూపించేసి ప్రేక్షకుల ఆగ్రహానికి బలయ్యాడు దర్శకుడు ఓం రౌత్. పైగా ఈ సినిమాలో చిత్ర విచిత్రమైన డైలాగులు పెట్టి రచయిత “మనోజ్ ముంతాషిర్ శుక్లా” హనుమాన్ భక్తుల ఆగ్రహానికి బలయ్యాడు. భగవత్స్వరూపమైన పాత్రలకు, ఎదో కమర్షియల్ సినిమాలలో పాత్రలను చూపించినట్టు చూపించడమే కాకుండా, ఆ పాత్రలతో అసందర్భమైన వాడుకలో వ్యాఖ్యలను రాసినట్టు రాసి విమర్శల పాలయ్యారు. మొత్తంగా చిత్ర యూనిట్ కొన్ని రోజులు అజ్ఞాతం లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.

- Advertisement -

అయితే ఆది పురుష్ సినిమా వచ్చిన తొలి రోజుల్లో మాత్రం భారీ ఓపెనింగ్స్ అందుకుంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ ప్రమోషన్లు చేయడం వల్ల, రాముని సెంటిమెంట్ తో అది పురుష్ భారీ ఓపెనింగ్స్ సాధించి సినిమా నష్టాలని కొంత వరకు తగ్గించింది. అయినా థియేట్రికల్ రన్ పరంగా ఆది పురుష్ బాగానే నష్టపోయింది. ఒక్కసారి ఆది పురుష థియేట్రికల్ కలెక్షన్లను ఏరియా వారీగా గమనిస్తే…

నైజాం 39.20 కోట్లు, సీడెడ్ 10.78 కోట్లు, ఉత్తరాంధ్ర 10.70 కోట్లు, ఈస్ట్ 6.22 కోట్లు వెస్ట్ 5 కోట్లు, గుంటూరు 6.80 కోట్లు, కృష్ణ 4.85 కోట్లు, నెల్లూరు 2.70 కోట్లు రాబట్టగా, టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 86.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక లో 12.45 కోట్లు, తమిళ నాడు లో 2.48 కోట్లు, కేరళ లో
0.87 కోట్లు వసూలు చేయగా, హిందీ వెర్షన్ ఇంకా రెస్ట్ అఫ్ ఇండియా కలెక్షన్లు కలుపుకుని 70.25 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 24.80 కోట్లు రాబట్టింది. ఫైనల్ గా ఆది పురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 197.10 కోట్ల షేర్, 397.50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే అది పురుష్ సినిమా 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, ఓవరాల్ గా వచ్చిన కలెక్షన్లు కాకుండా 45 కోట్ల నష్టం తీసుకువచ్చి బీలో యావరేజ్ గా నిలిచింది. అయితే ఆది పురుష్ అంత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా ఆల్మోస్ట్ 81.15% రికవరీ సాధించిందంటే సినిమా పై ఉన్న క్రేజ్ మాత్రమే అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలాంటి సినిమా మళ్ళీ రాకూడదని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు